తెల్లవారితే గురువారం నుంచి ‘మెల్లగా..మెల్లగా’ సాంగ్

5232
Mellaga Mellaga Lyrical Video Song | Thellavarithe Guruvaram | Simha Koduri | Kaala Bhairava
Mellaga Mellaga Lyrical Video Song | Thellavarithe Guruvaram | Simha Koduri | Kaala Bhairava

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీసింహా హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘తెల్లవారితే గురువారం’. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాకి దర్శకత్వం మణికాంత్ జెల్లీ వహించారు. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

చిత్ర శుక్ల, మిష నారంగ్, సత్య అక్కల, వైవా హర్ష, రాజీవ్ కనకాల తదితరులు నటించారు. సంగీతం కాల భైరవ అందించారు. ఇప్పటికే వదిలిన టీజర్, సాంగ్స్, పోస్టర్లు అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి.

 

అయితే తాజాగా ఈ సినిమా యొక్క లిరికల్ ‘మెల్లగా..మెల్లగా ‘ సాంగ్ ని ఈ రోజు సాయంత్రం 5:29 నిమిషాలకు విజయ్ దేవరకొండ రిలీజ్ చేసారు. మార్చి 21న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. అంతేకాదు దర్శకధీరుడు కూడా ఈ ఈవెంట్ కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.