Mem Famous Review In Telugu: రిలీజ్ కి ముందు నుంచే ట్రైలర్ ,పాటలు ,ప్రోమోలు ఇలా ప్రతి ఒక్కటి టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచిన మూవీ మేము ఫేమస్. ఇంచుమించుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నివాసం అనుకున్న అందరూ సినీ సెలబ్రిటీల చేత స్పెషల్ డాన్స్ వీడియోలతో ఈ సినిమాను డిఫరెంట్ బజ్ క్రియేట్ చేస్తూ ప్రమోట్ చేశారు. అంతెందుకు ప్రత్యేకించి దేని గురించి తన ఒపీనియన్ చెప్పని మహేష్ బాబు సైతం ఈ మూవీ బాగుంది అని ట్రీట్ చేయడం ఈ చిత్రానికి మరో క్రేజ్ అని చెప్పవచ్చు. మహేష్ బాబు ఒక్క ట్వీట్ తో ఈ చిత్రం రేంజ్ అమాంతం పెరిగిపోయింది. పోస్టర్ దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు ఎంతో డిఫరెంట్ గా ప్లాన్ చేసి విడుదల చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం….
Mem Famous Review In Telugu & Rating: 2.5/5 – నటీనటులు: సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య – రచన & దర్శకత్వం: సుమంత్ ప్రభాస్ – నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్..
కథ: అనగనగా బండనర్సంపల్లి అనే ఓ చిన్న గ్రామం.. రొటీన్ గా ప్రతి గ్రామంలో ఉన్నట్లుగానే జులాయిగా తిరిగే ముగ్గురు కుర్రాళ్ల బ్యాచ్…వారు తెచ్చే గొడవలు.. మరియు వారి జీవితంలో చోటు చేసుకునే మార్పులు.. ఈ నేపథ్యంలో సాగే కథ రొటీన్ గా ఉన్నప్పటికీ చూపించిన విధానం మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఏ పని పాట లేకుండా ఆవారాగా తిరిగే ఫ్రెండ్స్ మహేష్ (సుమంత్ ప్రభాస్), దుర్గ (మణి ఏగుర్ల) మరియు బాలకృష్ణ (మౌర్య) పని పాట లేకుండా తిరగడం ఊర్లో అనవసరంగా గొడవలు పెట్టుకోవడం అలాగే రాత్రిపూట అంజి మామ ట్రాక్టర్ షెడ్ లో కూర్చుని ఫుల్లుగా చిల్లవ్వడం…ఇది విన్న రోజువారి దినచర్య.
అయితే ఎలాంటి బాధ్యతలు లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే వీళ్ళ జీవితంలో ప్రేమ ఊహించని మార్పులు తీసుకొస్తుంది. చివరికి అల్లరి చిల్లరి పనులన్నీ మానేసి టెంట్ హౌస్ బిజినెస్ పెట్టిన మహి, బాలీ మరియు దుర్గకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ముగ్గురు జీవితాలలో ఎదురైన చాలెంజ్ను ఎలా దాటుతారు? పోకిరీలుగా తిరిగే వీరు ఊరికి మంచి ఎలా చేశారు? జులాయిలు చివరికి మేము ఫేమస్ అని ఎలా నిరూపించుకున్నారు ?తెలియాలి అంటే మూవీ చూడాల్సిందే.



విశ్లేషణ: పూర్తి తెలంగాణ నేటివీటి నేపథ్యంతో సాగే ఈ మూవీ కథ రొటీన్ గా ఉన్నప్పటికి కథనం కాస్త వినూత్నంగా ఎంటర్టైనింగ్ గా ఉంది అని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ మూవీ ఒక ఫీల్ గుడ్ మూవీ అని కచ్చితంగా యువత చూడవలసిన సినిమా అని పలువురు తామ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ లో ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఇవ్వడం తో కథ లో ఒక నిండుతనం వచ్చింది అని చెప్పవచ్చు. సినిమా మొత్తం బాగా ఎంగేజ్ ఇంకా ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంది. కానీ క్లైమాక్స్ మాత్రం కాస్త పేలవంగా ఉంది.
మొత్తానికి స్టోరీలో ఒక 15 నిమిషాల పాటు కాస్త సాగదీతగా అనిపించినప్పటికీ మిగతా సినిమా అంతా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. మూవీ లో లిపిస్టిక్ ఎపిసోడ్,
మహి,మౌనిక మధ్య కల్లు సీన్ మూవీ కి బలంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఇది ఒక యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ మూవీ. సాంకేతిక పరంగా కళ్యాణ్ నాయక్ అందించిన మ్యూజిక్ చిత్రానికి బాగా సరిపోయింది. అలాగే మౌనిక బర్త్ డే సీన్ తర్వాత జరిగే గొడవ మరియు ఇంటర్వెల్సి సినిమాపై ఇంట్రెస్ట్ ను బాగా పెంచుతాయి.
పాజిటివ్ పాయింట్స్:
మూవీ లో స్టోరీ మరియు క్యారెక్టర్స్ పెద్ద డెప్త్ లేకుండా సింపుల్ గా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
కష్టపడి ఎదగాలి అనుకుంటే చుట్టూ ఉన్నవాళ్లు ఏ విధంగా సహాయపడతారు అనే విషయాన్ని ఎంతో పాజిటివ్ యాంగిల్ లో మూవీ లో చూపించడం జరిగింది.
ఎమోషన్ మరియు కామెడీ లాంటి అంశాలు కూడా చిత్రంలో ఫుల్ గా ఉన్నాయి.
మైనస్ పాయింట్స్:
కథ రొటీన్ గా ఈజీగా గెస్ చేసే విధంగా ఉంది.
సినిమా రన్ టైం లో 30 నిమిషాల పాటు కథ ఆడియన్స్ ఎంగేజ్ చేయడంలో విఫలమైంది.
స్లో నారేషన్ మరియు లాగ్ బోరింగ్ అనిపిస్తాయి.
చివరి మాట: ఓ మంచి ఫీల్ గుడ్ కామెడీ మూవీ ని చూడాలి అనుకుంటే ఈ వీకెండ్ తప్పకుండా మేము ఫేమస్ సినిమాని చూసి ఎంజాయ్ చేయవచ్చు.
Web Title: Mem Famous Review In Telugu, Mem Famous Movie Review, Mem Famous Telugu Movie Review, Mem Famous Review, Sumanth Prabhas, Saarya and Mourya Chowdary