Homeసినిమా వార్తలువిశ్వ‌క్ సేన్‌, సందీప్ కిష‌న్ చేతుల మీదుగా విడుద‌లైన ‘#మెన్ టూ’ ట్రైల‌ర్‌

విశ్వ‌క్ సేన్‌, సందీప్ కిష‌న్ చేతుల మీదుగా విడుద‌లైన ‘#మెన్ టూ’ ట్రైల‌ర్‌

Brahmaji, Kaushik, Sudharshan, Riya Suman, Priyanka Sharma and Viva Harsha Mentoo Trailer Released, Mentoo New movie release date, Mentoo telugu movie, Vishwak Sen new movie, Sandeep Kishan New movie, Mentoo trailer launch by Sandeep kishan and Vishwak Sen. Telugu Movie News

Mentoo Trailer Released: నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, కౌశిక్ ఘంట‌శాల‌ రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తోన్న చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మౌర్య సిద్ధ‌వ‌రం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 26న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. కొన్నాళ్లు ముందు విడుదల చేసిన ఈ మూవీ ట్రైల‌ర్ అంద‌రిలో ఆస‌క్తిని పెంచింది.

Mentoo Trailer Released: తాజాగా ఈ మూవీ నుంచి ట్రైల‌ర్‌ను యంగ్ హీరోస్ విశ్వ‌క్ సేన్‌, సందీప్ కిష‌న్ విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ‘#మెన్ టూ’ అనేది మ‌న ఇండియా పెద్ద ఎత్తున జ‌రిగిన సామాజిక ఉద్య‌మం. ఇది మీ టూ ఉద్య‌మంలో త‌ప్పుడు లైంగిక ఆరోప‌ణ‌ల‌కు వ్యతిరేకంగా ప్రారంభించబ‌డ్డ ఉద్య‌మం.

ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఫెమినిజ‌మ్ కొటేష‌న్‌తో స్టార్ట్ అయ్యింది. స్త్రీ, పురుషుల మ‌ధ్య స‌మాన‌త్వం అనే పాయింట్ మీద డిస్క‌ష‌న్ జ‌ర‌గ‌టాన్ని చూపించారు. ఆడ‌వాళ్లు లేని చోట‌నే మ‌గ‌వాళ్లు హ్యాపీగా ఉంటార‌నే విష‌యాన్ని బ్ర‌హ్మాజీ వివ‌రించారు. మ‌గ‌వాళ్లు త‌మ జీవితాల్లో ఆడ‌వారి వ‌ల్ల ప‌డే బాధ‌ల‌ను ఎంట‌ర్‌టైనింగ్ యాంగిల్‌లో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

Mentoo Trailer Released

ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను మ‌గ‌వాళ్లు ఎలా హ్యండిల్ చేస్తార‌నే దాన్ని కూడా చూపించారు. హిలేరియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘#మెన్ టూ’ సినిమా ఉంటుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. డైలాగ్స్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. హ‌క్కులు స్త్రీల‌కే కాదు.. పురుషుల‌కు ఉంటుంద‌ని తెలియ‌జేసే సినిమా అని తెలుస్తుంది. కామెడీ, ల‌వ్‌, ఎమోష‌న్స్ ఇలా అన్నీ అంశాల క‌ల‌యిక‌గా ‘#మెన్ టూ’ మూవీని రూపొందించారు. యూత్‌ను టార్గెట్ చేసి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని తెలుస్తుంది. మే 26న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY