Messive Screens Allotted For Rajinikanth 2
Messive Screens Allotted For Rajinikanth 2

రజినీకాంత్-శంకర్-లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్ లో తెరకెక్కిన 2.0 అవుట్ ఫుట్ అబ్బురపరచినా ఆ సినిమా గ్రాఫికల్ వర్క్ విషయంలో జరిగిన ఆలస్యం,అవకతవకల వల్ల సినిమా బడ్జెట్ చేతులు దాటిపోయే పరిస్థితి వచ్చింది.350 కోట్లు అనుకున్న బడ్జెట్ 100 కోట్లు పెరిగి 450 కోట్లు అయ్యింది.దాంతో హిందీ లో భారీ వసూళ్లు సాధించినా,తెలుగు తమిళ్ లో సైతం హిట్ టాక్ వచ్చినా కూడా సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గానే మారింది.అయితే ఇక్కడితో 2.0 చరిత్ర ముగిసిపోలేదు.ఇప్పుడు ఈ సినిమా చైనా బాక్స్ ఆఫీస్ ని షేక్ చెయ్యడానికి రెడీ అయ్యింది.

లయన్ కింగ్ సినిమా వల్ల చైనాలో 2.0 రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది.ఇప్పుడు లైన్ క్లియర్ అవ్వడంతో ఏకంగా 47 వేలకు పైగా స్క్రీన్స్ లో 3D వెర్షన్ లో చైనా రిలీజ్ ని భారీగా ప్లాన్ చేసారు.సెప్టెంబర్ 6 న రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ టైం లో వరల్డ్ వైడ్ గా వచ్చిన బజ్,రజిని,అక్షయ్ లకు చైనాలో ఉన్న గుర్తింపు,కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ వర్క్,సినిమాలోని సున్నితమయిన ఎమోషన్…ఇలా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా 2.0 చైనీస్ వెర్షన్ కి కలిసొచ్చేవే.అక్కడ ఈ సినిమా హిట్ అయితే మాత్రం శంకర్ ఫుల్ జోష్ లో భారతీయుడు-2 ని తెరకెక్కిస్తాడు.అక్కడ ఈ సినిమా లాభాలు రాబడితే భారతీయుడు సినిమాకి లైకా విధించిన బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ కూడా తొలగిపోయినట్టే.అంటే ప్రస్తుతానికి కమల్ సినిమా భవిష్యత్తు రజిని చేతిలో ఉంది అనుకోవచ్చు.ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే సెప్టెంబర్ 6 వరకు ఆగాల్సిందే.

 

Consider these articles: