Meter Movie Review In Telugu: హిట్ ఫ్లాప్ చిత్రాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీస్తున్న యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ సంవత్సరం మాత్రం నటించిన వినరో భాగవతం వీర కథ చిత్రం మంచి హిట్గా అదే జోరులో మాస్ యాంగిల్ ను అటెంప్ట్ చేస్తూ అతను నటించిన లేటెస్ట్ మూవీ మీటర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం.
Meter Movie Review In Telugu:
నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, పవన్, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి తదితరులు
దర్శకుడు : రమేష్ కాడూరి
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
సంగీత దర్శకులు: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ ఆర్
రన్ టైం : 2 గంటల 7 నిమషాలు
Rating: 2/5
కథ : కిరణ్ అబ్బవరం తండ్రి ఓ నిజాయితీపరుడైన కానిస్టేబుల్ కావడంతో కొన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాడు. అందుకే అతని కొడుకును ఎస్ఐ చేయాలి అని కలకంటూ ఉంటాడు. మరి ఇటు కిరణ్ కు పోలీస్ అవ్వడం పై ఎటువంటి ఆసక్తి లేదు. కానీ అనూహ్యంగా సెలక్షన్స్ క్లియర్ చేసి అతను ఎస్ఐ అవుతారు. ఇక డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పటి నుంచి ఎలా డిస్మిస్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్న కిరణ్ కు అనుకోకుండా హోమ్ మినిస్టర్ కంఠం బైరెడ్డితో క్లాస్ వస్తుంది. అసలు ఇద్దరి మధ్యకు గొడవకు కారణం ఏమిటి? ఎలక్షన్స్ లో అధికారం లోకి రావడానికి బైరెడ్డి చేసిన స్కామ్ ఏమిటి? ఈ క్రమంలో కిరణ్ నిజమైన పోలీసుగా ఎలా మారుతాడు? అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఈ మూవీ మంచి మాస్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు.
ప్రతి సీన్ ప్రతి డైలాగ్ మంచి హైపుని క్రియేట్ చేస్తుంది.
‘మనం చదివేసిన బుక్ షెల్ఫ్‌లో ఉంటుందేమో కానీ అది ఇచ్చిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం చాలా హైలో ఉంటుంది’ తరహా డైలాగులు మూవీ రేంజ్ను పెంచాయి.
మైనస్ పాయింట్స్:
కథ రొటీన్ గా ఉండడంతో మూవీలో ఏమంత కొత్తదనం లేదు అని చెప్పవచ్చు.
అబ్బాయిల్ని అసహ్యించుకునే హీరోయిన్ ఒకే ఒక్క పాటతో హీరోని లవ్ చేయడం కాస్త విచిత్రంగా ఉంది.
కొన్ని యాక్షన్స్ అన్ని వేషాలు ఆల్రెడీ మిగతా సినిమాల్లో చూసినట్లుగానే అనిపిస్తాయి.
చివరి మాట: మూవీ ఓవర్ ఆల్ గా మాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగా ఉంది. అయితే చిత్రంలో లాజిక్ ఆలోచించే వారికి మాత్రం సీన్స్ రిపీటెడ్ గా అనిపించడం ఖాయం. అన్నిటికి మించి సినిమాలో రొటీన్ కంటెంట్ తో పాటు అనవసరమైన యాక్షన్ సీన్స్ చాలా బోర్ గా సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. కొత్తదనాన్ని మరియు ఎంటర్టైన్మెంట్ ని ఆశించేవారు థియేటర్లో ఈ చిత్రాన్ని చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు కాబట్టి ఓటీటీలో విడుదల అయ్యేంతవరకు ఓపిక పట్టాల్సి ఉంటుంది.