Michael Telugu Movie Review & Rating : 2.5/5
నటీనటులు: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌశిక్, గౌతం మీనన్, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, అనసూయ, వరలక్ష్మి శరత్‌కుమార్
దర్శకుడు : రంజిత్ జయకోడి
నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు
సంగీత దర్శకులు: సామ్ సిఎస్
Michael Movie Review In Telugu: యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ మా టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రతి సినిమాకి తన యాక్టింగ్ లో వేరియేషన్ చూపిస్తూ ప్రజల్ని ఆకర్షిస్తున్నాడు. మొదటిసారిగా మైఖేల్ అనే ఫ్యాన్ ఇండియా మూవీ తో మన ముందుకు వచ్చారు ఈరోజు. సందీప్ కిషన్ నటించిన ఈ మైకేల్ మూవీ ఎలా ఉందో చూద్దాం పదండి.
Michael Movie Review In Telugu: కథ: చిన్నతనంలోనే అనాథగా మారిన మైకేల్ (సందీప్ కిషన్).. తన తల్లిని మోసం చేసిన తండ్రిని చంపడమే లక్ష్యంగా ముంబయిలో అడుగు పెడతాడు. అప్పటికే అక్కడ పెద్ద డాన్ గా ఎదిగిన గురునాథ్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) అతణ్ని చేరదీస్తాడు.
అక్కడ తన పనితనంతో గురునాథ్ కి బాగా దగ్గర అవుతాడు. ఐతే, గురునాథ్ పై హత్య ప్రయత్నం చేసిన వారిని చంపమని మైఖేల్ కి చెబుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మైఖేల్ తీరా (దివ్యాంశ కౌశిక్) కి దగ్గర అవుతాడు.
మరి గురు చెప్పినట్లు అతను తీర తండ్రిని చంపాడా.. అతను తీసుకున్న నిర్ణయంతో ఎదురైన పరిణామాలేంటి.. ఇంతకీ మైకేల్ తండ్రి ఎవరు.. అతణ్ని మైకేల్ చంపాడా లేదా.. ఈ విషయాలన్నీ తెర మీదే చూసి తెలుసుకోవాలి.
ప్లస్ లు:
సందీప్ కిషన్, వరుణ్ సందేశ్, విజయ్ సేతుపతి
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
యాక్షన్ బ్లాక్స్
మైనస్ లు:
స్లో నెరేషన్
స్క్రీన్ ప్లే
రన్ టైమ్
నటీనటులు: యాక్టింగ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ మైఖేల్ సినిమా కోసం చాలానే కష్టపడ్డాడు. అతను తన లుక్ మీద బాగానే దృష్టిపెట్టాడు. చేసింది రౌడీ పాత్రే కానీ.. అందులో స్టైలిష్ గా కనిపించాడు. హీరోయిన్ దివ్యాంశ అందంగా కనిపించింది. ఆ పాత్రలో విషయం లేదు. విజయ్ సేతుపతి కనిపించిన కాసేపు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు.
కీలక పాత్రలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ జస్ట్ ఓకే అనిపించాడంతే. ఇందులో మాత్రం దర్శకుడు అతణ్ని సరిగా వాడుకోలేదు. వరలక్ష్మి చిన్న పాత్రలో కాసేపు మెరిసింది. అనసూయ పాత్ర చాలా సాధారణంగా అనిపిస్తుంది. దర్శకుడు స్టోరీ మీద చూపించిన శ్రద్ధ మిగతా క్రాఫ్ట్ మీద చూపించలేకపోయాడు.
తీర్పు: మైఖేల్ యాక్షన్ డ్రామా తో వచ్చిన సందీప్ కిషన్ కొంతవరకు మెప్పించగలిగాడు కానీ దర్శకుడు ఎంచుకున్న కథలు ఇంకొంచెం మార్పులు చేసి ఉన్నట్టయితే అలాగే స్క్రీన్ ప్లే వర్క్ చేసినట్లయితే బాగుండేది. మైఖేల్ కథలో డెప్త్ ఉన్నా.. సీన్స్ కన్ ఫ్యూజ్డ్ గా స్లోగా అండ్ రొటీన్ గా సాగాయి. పైగా మెయిన్ ప్లాట్ లోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ప్రధాన కాన్ ఫ్లిక్ట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు.
మైఖేల్ జీవితంలో జరిగిన పరిణామాలను, అలాగే తన తల్లికి అన్యాయం చేసిన వ్యక్తి పై పగ తీర్చుకునే క్రమాన్ని కొంతవరకు బాగానే ఎలివేట్ చేశారు. అదే విధంగా మైఖేల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు అనే కోణంలో ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశారు.
విపరీతమైన బిల్డప్ తో మొదలై కాసేపటికే తుస్సుమనిపించే ఆరంభ సన్నివేశాలతోనే ప్రేక్షకులు ఈ సినిమాతో డిస్కనెక్ట్ అయిపోతారు. ముందుకు సాగేకొద్దీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది ‘మైకేల్’. ఐతే, స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్ట్ మిస్ అవ్వడం, అలాగే ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ కూడా బలహీనంగా ఉండటం వంటి అంశాలు సినిమాకి బాగా మైనస్ అయ్యాయి. ఐతే, సినిమాలో సందీప్ కిషన్ నటన బాగుంది. మొత్తం మీద సందీప్ కిషన్ ఫ్యాన్స్ ఈ సినిమాని వీకెండ్ చూసి ఎంజాయ్ చేయవచ్చు.