Mike Tyson in Vijay devarakonda Puri Fighter Movie
Mike Tyson in Vijay devarakonda Puri Fighter Movie

(Vijay Devarakonda Puri Fighter Movie Updates) ఇస్మార్ట్ శంకర్‌ సినిమాతో సూపర్‌ హిట్ కొట్టిన పూరి తిరిగి ఫుల్‌ ఫాంలోకి వచ్చాడు. చాలా రోజులుగా సాలిడ్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్న పూరికి ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌ కొత్త ఊపు ఇచ్చింది. అదే జోరులో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎనౌన్స్‌ చేశాడు. అయితే ఈ సారి గతంలోలా సినిమాను చుట్టేయకుండా పక్కాగా ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలని డైరెక్టర్ పూరి మరియు నిర్మాత ఛార్మీ భావిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఈ ప్రాజెక్ట్ కు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇస్మార్‌ శంకర్‌ తరువాత విజయ్‌ దేవరకొండ హీరోగా ఫైటర్‌ సినిమాను ఎనౌన్స్‌ చేశాడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాల శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాతో మరోసారి టాప్‌ డైరెక్టర్స్‌ లిస్ట్‌లోకి చేరాలి భావిస్తున్న పూరి, ఫైటర్‌ను అదే స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నాడు.ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో విలన్ గా మైక్ టైసన్ ను తీసుకునే ప్లాన్స్ జరుగుతున్నాయట. ఇది వర్కౌట్ అయితే సినిమాకి అధనపు బలం చేకూరుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. అయితే మైక్‌ పూరి సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు అంగీకరిస్తాడా లేదా అన్న విషయం చూడాలి.

విజయ్‌ దేవరకొండకు జోడిగా బాలీవుడ్‌, శ్రీదేవి కూతురు భామ జాన్వీ కపూర్‌ను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. విజయ్‌ దేవరకొండకు నేషనల్‌ లెవల్‌లో క్రేజ్‌ ఉండటంతో ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాడు పూరి.