రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ కొరటాల NTR30 మూవీ బడ్జెట్..!

0
2906
Mind Blowing budget for NTR and koratala Siva NTR 30

NTR30: ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో 30వ చిత్రాన్ని చేస్తున్నారు. ‘జనతా గ్యారేజ్’ సినిమాతో ఐదేళ్ళ కింద సంచలన విజయం సాధించిన వీళ్లిద్దరు.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రిపేర్లు చేయడానికి వచ్చేస్తున్నారు.

ఎన్టీఆర్ 30వ సినిమా కోసం మైండ్ బ్లోయింగ్ అనేలా బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా నటీనటులు విషయంలో కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్లుగానే ఆలోచిస్తున్నారు. ఎన్టీఆర్ 30వ సినిమాకు మొదట 100కోట్ల వరకు ఖర్చవుతుందని అనుకున్నారట. కానీ ఎప్పుడైతే సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని అనుకున్నారో బడ్జెట్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. దాదాపు 200కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది ఏప్రిల్ 29, 2022న ఈ చిత్రం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆగష్టు తర్వాత షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్ షూటింగ్ చేయాలని భావిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ.