సమీక్ష : మిస్ మ్యాచ్

302
miss match telugu movie review
miss match telugu movie review

టైటిల్ : మిస్ మ్యాచ్
రేటింగ్ : 3.25/5
నటీనటులు : ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్, సంజయ్ స్వరూప్, రూప లక్ష్మి, శరణ్య తదితరులు
కెమెరా : గణేష్ చంద్ర
మ్యూజిక్ : గిఫ్టన్
నిర్మాతలు : జి శ్రీరామ్ రాజు, భరత్ రామ్
డైరెక్టర్ : ఎన్.వి. నిర్మల్ కుమార్
బ్యానర్ : అథిరోహ్ క్రియేటివ్ సైన్స్

వైవిధ్యమైన సినిమాలు చేయడం చాల పెద్ద రిస్క్.. కమర్షియల్ సినిమాలు ఎక్కువుగా ఇష్టపడే ఆడియన్స్ ఉన్న టాలీవుడ్ లో కంటెంట్ సెంట్రిక్ సినిమాలు చాల తక్కువుగా తెరకెక్కుతుంటాయి. ఇదే తరహాలో ఫీల్ గుడ్ కంటెంట్ ఉన్న సినిమా అంటూ మూవీ లవర్స్ ని అట్ట్రాక్ట్ చేసిన మూవీ ‘మిస్ మ్యాచ్’ . ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ఈ సినిమాకు డాక్టర్ సలీం ఫేమ్ నిర్మల్ కుమార్ డైరెక్టర్ . ఈ శుక్రవారం రిలీజ్ అయిన ‘మిస్ మ్యాచ్’ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ : హీరో ఉదయ్ శంకర్ ఫ్యామిలీ లో ఉన్నవారంతా చాలా క్లాస్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఫామిలీ మొత్తం పల్లెటూరి బ్యాచ్, పైగా హీరో ఫామిలీ అంత చాల చదువుకొని సాఫ్ట్వేర్, కాలేజీ ప్రొఫెసర్ అంటూ జాబ్స్ చేస్తుంటారు, ఇటు వైపున హీరోయిన్ ఫామిలీ మాత్రం చాల సాదా సీదా మనుషులు, పక్క పల్లెటూరి వాళ్ళు, సిటీ కల్చర్ కి బాగా దూరం గా ఉండటానికి ఇష్టపడుతుంటారు, ఇలా రెండు భిన్నకోణాలున్న కుటుంబాల నుంచి వచ్చిన ఒక పల్లెటూరి పిల్ల, ఓ ఐ ఐ టి కుర్రాడి ప్రేమ కథ ఎలా సక్సెస్ అయిందో తెలియాలంటే ‘మిస్ మ్యాచ్ ‘ చూడాల్సిందే…

విశ్లేషణ : విజయ్ ఆంథోనీ అనే మ్యూజిక్ డైరెక్టర్ ని నటుడిగా తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేసిన సినిమా డాక్టర్ సలీం, ఈ మూవీ కి అప్పట్లో చాలా ప్రసంసలు దక్కాయి . ఆ సినిమా డైరెక్టర్ నుంచి వచ్చిన సినిమా కాబట్టి ‘మిస్ మ్యాచ్ ‘ ఫై మూవీ లవర్స్ బాగా హోప్స్ పెట్టుకున్నారు, ముందు నుంచి చెబుతున్నట్లుగానే డైరెక్టర్ నిర్మల్ కుమార్ ఈ కథ ని ముఖ్య కథాంశం చుట్టూనే నడిపించాడు.

సినిమా కోసం ఎంచుకున్న లైన్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ జాయిన్ చేసే స్కోప్ ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ట్రాక్ తప్పకుండా సరైన దారిలో ‘మిస్ మ్యాచ్ ‘ స్టోరీ ని రక్తి కట్టించాడు. డైరెక్టర్ నిర్మల్ కుమార్, ఇక ఇలాంటి వైవిధ్యమైన స్టోరీలు ఎంచుకొన్నపుడు ఇందులో నటించే వారు కూడా వారి నటనలో వైవిధ్యం చూపించాలి, హావభావాలు విషయంలో చాల పర్ఫెక్ట్ గా ఉండాలి, హీరో ఉదయ్ శంకర్ కి ఇది రెండో సినిమానే కావచ్చు కానీ, తన మొదటి సినిమా ‘అటగదరా శివ’ కంటే ‘మిస్ మ్యాచ్ ‘ లో తన నటన లో పరిణితి తెచ్చుకున్నాడు.

ఛాన్స్ ఉంటె చాలు కమర్షియల్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే నేటి యంగ్ హీరోల మాదిరి కాకుండా, కొత్త కుర్రాడు కొత్తగా ట్రై చేస్తున్నాడు అనే భావం ఆడియన్స్ లో కలిగించాడని ఉదయ్ శంకర్ ఈ సినిమా ద్వారా మరో సారి ప్రయత్నించినట్లు కనిపిస్తుంది, క్లాస్ లుక్స్ తో ఉదయ్ శంకర్ తాను పోషించిన పాత్ర కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు, అలానే ఐశ్వర్య రాజేష్ తో ఉదయ్ కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమా లో హీరో కి సమానంగా నిలిచే పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించింది అని నిర్మొహమాటం గా చెప్పవచ్చు, ఎందుకంటే ఆ రేంజ్ లో ఐశ్వర్య క్యారెక్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది., ఓ లేడీ రేస్లర్ గా కనిపించాలని ఐశ్వర్య పడిన కష్టం, తనకి నటన ఫై డెడికేషన్ మరో సారి మిస్ మ్యాచ్ మూవీ తో క్లియర్ గా ఆడియన్స్ కి కనిపిస్తాయి, ఇక ఓ పల్లెటూరి అమ్మాయి గా అమాయకంగా కనిపిస్తూనే రేస్లర్ గా స్పోర్ట్స్ లుక్ లో సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది ఐశ్వర్య రాజేష్, అలానే వీరిద్దరితో పాటు, శరణ్య , సంజయ్ స్వరూప్, రూప లక్ష్మి తమ పాత్రల పరిధిలో నటించారు.

అలానే ఇలాంటి కంటెంట్ డ్రివెన్ సినిమాకు పెట్టుబడి పెట్టి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను రిచ్ గా నిర్మించినందుకు నిర్మాతలు శ్రీరామ్ రాజు,భారత్ రామ్ లను అభినందించాల్సిందే, అలానే గణేష్ చంద్ర కెమెరా పనితనం, గిఫ్టన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మిస్ మ్యాచ్ ను ఆడియన్స్ కి మరింత దగ్గర అయ్యేలా చేస్తాయి అని చెప్పడం లో సందేహం అవసరం లేదు, కధనం లోకొన్నిసార్లు స్లో అనిపించినా , మిస్ మ్యాచ్ మాత్రం ఓ ఫీల్ గుడ్, ఎమోషనల్ లవ్ స్టోరీ గా ఆడియన్స్ ని అలరించడం ఖాయం.కుటుంబ సమేతంగా చూడ తగ్గ చిత్రమిది.