Miss Shetty Mr Polishetty New Release Date: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి చాలా రోజులు క్యాప్ తీసుకున్న తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క శెట్టి కూడా బాహుబలి తర్వాత కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన రోజు నుండి భారీ అంచనాలు ఉన్నాయి. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి క్లీన్ ఎంటర్టైనర్ గురించి చాలా మంది ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమా విడుదల తేదీని పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తుంది.
Miss Shetty Mr Polishetty New Release Date మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా మేకర్స్ నిన్న విడుదల తేదీని మారుస్తున్నట్టు అఫీషియల్ గా సోషల్ మీడియా వేదికగా ప్రెస్ నోట్ ని విడుదల చేయడం జరిగింది. ప్రొడక్షన్ కార్యక్రమాలు లేట్ అవటంతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విడుదల తేదీని మారుస్తున్నట్టు ప్రకటించారు. మొదటిగా ఈ సినిమాని ఆగస్టు నాలుగున విడుదలకు సిద్ధం చేశారు. అయితే ఇప్పుడు సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ ఆగస్టు 18న విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.
మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. రాధన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని పాటలు కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియో నుంచి. అనుష్క శెట్టి అలాగే నవీన్ పోలిశెట్టి ఫ్యాన్స్ ని అలాగే మూవీ లవర్స్ ని అధరిస్తారో లేదో చూడాలి. యూవీ క్రియేషన్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.