Miss Shetty Mr Polishetty Teaser Talk: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty), యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా టీజర్ (Teaser) ను రిలీజ్ చేసారు.
Miss Shetty Mr Polishetty Teaser Talk:ఈ టీజర్ లో ‘ఫుడ్ ఏమీ మ్యాజిక్ కాదు.. ఇదొక సైన్స్’ అంటూ అనుష్క ఒక అన్విత రవళి శెట్టి అనే చెఫ్ గా కనిపించింది. పెళ్లీడు వచ్చినా ఆమె ఇంకా సింగిల్ గానే ఉంది. తన కూతురు సామాన్యురాలు కాదని.. ఆమె ఎప్పటికీ పెళ్లి చేసుకోదని అనుష్క తల్లి చెబుతోంది. మరోవైపు నవీన్ పోలిశెట్టిని సిద్ధు శెట్టి అనే స్ట్రగులింగ్ స్టాండప్ కమెడియన్ గా కనిపించాడు. ‘క్రిప్టో కరెన్సీ జోక్స్ చెప్పినా, తన దగ్గర కరెన్సీ లేదు’ ‘బైసెప్స్ పెద్దగా ఉన్నాయి.. ఇంజక్షన్ ఇరిగిపోద్ది జాగ్రత్త’ వంటి వన్ లైనర్ డైలాగ్స్ తో తనదైన శైలిలో నవ్వించాడు.
అయితే కొన్ని పరిస్థితుల్లో అనుష్క (Anushka Shetty) పని చేస్తున్న హోటల్ లో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారి మధ్య ఫ్రెండ్ షిప్, ఫన్నీ ఇన్సిడెంట్స్ టీజర్ లో మనం చూడొచ్చు. కానీ మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ప్రేమలో పడ్డారా లేదా అనే విషయాన్ని చూపించకుండా ఈ వీడియోని కట్ చేసారు. అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేయడం తన స్ట్రెంత్ ఐతే, సిచ్యుయేషన్ కు సంబంధం లేకుండా కామెడీ చేయడం తన వీక్ నెస్ అని చెప్పడం నవ్వు తెప్పిస్తుంది. ‘నీ టైమింగ్ ఎప్పుడూ ఇంతేనా?’ అని అనుష్క అడగ్గా.. ‘కామెడీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది మేడం’ అని నవీన్ చెప్పడంతో ఈ టీజర్ ముగిసింది.
‘ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ’ ‘జాతిరత్నాలు’ చిత్రాలతో అలరించిన నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty).. ఈసారి అనుష్కతో కలిసి నవ్వులు పూయించబోతున్నాడని అర్థమైంది. సీనియర్ హీరోయిన్, యంగ్ హీరో జోడీ ఫ్రెష్ గా అనిపించింది. ఓవరాల్ గా ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు ఈ టీజర్ హింట్ ఇచ్చింది. ఈ సినిమాలో జయసుధ, నాజర్, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తి, అభినవ్ గోమటం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రధన్ సంగీతం సమకూర్చగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా చేస్తున్నారు.
‘Miss. శెట్టి Mr. పోలిశెట్టి’ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ – ప్రమోద్ నిర్మించారు. ఈ మూవీని తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ‘జాతి రత్నాలు’ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న నవీన్.. చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్ మీద కనిపించబోతున్న అనుష్క కలిసి ఏ మేరకు అలరిస్తారో చూడాలి.