MLA honeytrap case_ south movie actress and call girls
MLA honeytrap case_ south movie actress and call girls

ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో హనీట్రాప్ గురించి పెద్ద ఎత్తున మాట్లాడుకుంటూ ఉన్నారు. కొందరు వ్యక్తులను టార్గెట్ చేయడం.. అందమైన అమ్మాయిలను వలగా వేయడం.. ఆ తర్వాత ఈ అమ్మాయిలు వారితో సన్నిహితంగా గడిపే సమయంలో వీడియోలను, ఫోటోలను తీసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం. వారికి అవసరమైన పనులు చేయించుకోవడం. ఇలాంటి ప్లాన్స్ ఎన్నో సార్లు.. ఎంతో మంది ప్రయోగించారు.

కానీ ఇప్పుడు కర్ణాటక రాజకీయనాయకుల పేర్లు పెద్ద ఎత్తున బయటకు వచ్చాయి. ముఖ్యంగా హీరోయిన్ కూడా ఈ హనీట్రాప్ వ్యవహారంలో ఉండడం అందరినీ టెన్షన్ పెడుతోంది. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల శృంగార వీడియోలు బయటపడ్డం హాట్ టాపిక్ గా మారింది. రాఘవేంద్ర అనే వ్యక్తి తన ప్రియురాలు, కొందరు యువతులను ఎమ్మెల్యేల వద్దకు పంపించాడు.. ఆ తర్వాత నాయకులు అమ్మాయిలతో గడుపుతున్న రహస్య వీడియోలు సేకరించి భారీగా డబ్బు డిమాండ్‌ చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ మొదలుపెట్టారు. రాఘవేంద్ర, అతని ప్రియురాలు పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి.

కర్ణాటకలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ట్రాప్‌ చేసిన హనీట్రాప్‌ కేసులో శాండల్‌వుడ్‌(కన్నడ సినీ పరిశ్రమ)కు చెందిన ముగ్గురు నటీమణుల పాత్ర ఇందులో ఉన్నట్లు సీసీబీ పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ కూడా ఉండగా మరో ఇద్దరు రెండు, మూడు సినిమాల్లో నటించిన వారు ఉన్నారు.. అలాగే పలు సీరియల్స్ లో నటించిన వాళ్ళు కూడా ఈ హనీ ట్రాప్ వ్యవహారంలో ఉన్నారు. సుమారు 25కు పైగా చిత్రాల్లో పలువురు ప్రముఖ హీరోలతో నటించిన హీరోయిన్‌ అట..! ఈ విషయం శాండిల్ వుడ్ ను కుదిపేస్తోంది. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించి త్వరలోనే ఆ హీరోయిన్స్ ను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.