Mocobot camera for Game Changer climax shoot: స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15 వ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మెగా అభిమానులకు ఎక్స్పెక్టేషన్స్ అంతకంటే భారీగా ఉన్నాయి. ఆచార్య సినిమా తర్వాత రామ్ చరణ్ RRR లో నటించాడు కానీ సింగిల్ హీరోగా చేస్తున్న చిత్రం చాలా లాంగ్ ఆపు తర్వాత ఇదే అని చెప్పవచ్చు. దానికి తోడు ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తో రామ్ చరణ్ (Ram Charan) ఫ్యాన్ ఇండియన్ స్టార్ నుంచి పాన్ వరల్డ్ స్టార్ గా గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు.కాబట్టి ఈ చిత్రంపై చాలామంది ఆశలు పెట్టుకొని ఉన్నారు.
Mocobot camera for Game Changer climax shoot: గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి శంకర్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ మరియు షెడ్యూల్ ప్లాన్ చేస్తూనే ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించిన మరో తాజా అప్డేట్ మెగా ఫాన్స్ ను ఖుష్ చేసింది. ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ షూట్ ఎక్స్ట్రార్డినరీగా ఉండడంతో పాటు ఆక్షన్ సీన్స్ ప్రేక్షకులను వేరే లెవెల్ లోకి తీసుకు వెళ్తాయి. శంకర్ చెప్పినట్లుగానే గేమ్ చేంజర్ యొక్క క్లైమాక్స్ షో నిజంగా సినిమాకే గేమ్ చేంజ్ అని చెప్పవచ్చు.
ఎందుకంటే క్లైమాక్స్ ఆశామాక్షిగా అయితే లేదు. శంకర్ (Shankar) రేంజ్కి తగ్గట్టుగానే భారీ ఎత్తున క్లైమాక్స్ నిర్మిస్తున్నారు. ఈ క్లైమాక్స్ (climax shoot) కోసం ఎంచుకున్న ఫైటర్స్ పదో 21 కాదు ఏకంగా 1200 మంది. ఈ 1200 మందితో చరణ్ (Ram Charan) చేసే యాక్షన్ సీన్ బ్లాక్ బస్టర్ గా ఉంటుందట. అంతేకాకుండా ఈ సన్నివేశం కోసం హైదరాబాద్ హౌస్ కట్స్ లో మూడు భారీ చెట్లను కూడా నిర్మించడం జరిగింది.
గేమ్ చేయ్జర్ యొక్క లాస్ట్ షూటింగ్ ఈ సెట్స్ లోనే జరుగుతుంది. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ కు దాదాపు 30 రోజుల పైగా టైం పడుతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. మూవీకి సంబంధించిన ఈ సీన్ ఎంతో కీలకమైనది మరియు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేది కావడంతో శంకర్ ప్రస్తుతం ఫుల్ ఫోకస్ దీనిపైన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో చరణ్ (Ram Charan) సరసన హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ నటిస్తున్నారు. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయడంతో మరో క్యారెక్టర్ పక్కన హీరోయిన్గా అంజలి నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే దిశగా చిత్రానికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.