టాలీవుడ్ స్టార్స్ ప్రయత్నాన్ని అభినందించిన మోదీ.. స్పందించిన చిరంజీవి..!

609

Chiranjeevi, Varun Tej, Sai dharam Tej, Modi: ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఇళ్ల నుండి బయటకు రాకండి.. సామాజిక దూరాన్ని పాటించాలి అని కోరుతూనే ఉన్నారు. మొదటి నుండి మెగా స్టార్ చిరంజీవి కరోనా మహమ్మారిపై సామాజిక మాధ్యమాల్లో తన వంతుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యనే టాలీవుడ్ అగ్రనటులు మెగాస్టార్ చిరంజీవి, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు కలిసి ఓ వీడియోలో నటించారు. దీన్ని చూసిన భారత ప్రధాని నరేంద్రమోదీ వీరందరికీ అభినందనలు తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ పాటను స్వరపరిచి ఆలపించాడు.

ఈ పాటను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. చిరంజీవి గారికి, నాగార్జున గారికి, వరుణ్‌తేజ్‌కి, సాయితేజ్‌కి మీ అందరూ ఇచ్చిన చక్కని సందేశానికి నా ధన్యవాదాలు అని ట్వీట్ చేసి అభినందించారు. మోదీ తెలుగులో ట్వీట్ చేయడం చూసి పలువురు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మోదీ వ్యాఖ్యలపై ధన్యవాదాలు చెప్పారు చిరంజీవి. ‘మీ మంచి మాటలకు ధన్యవాదాలు మోదీ గారు. కరోనా కారణంగా మన దేశానికి జరిగిన నష్టాన్ని నివారించేందుకు మీరు చేస్తున్న నిర్విరామ కృషిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఈ మహాకార్యంలో తాము కూడా మా వంతుగా ఈ చిన్న సాయం చేశాం. సంగీత దర్శకుడు కోటి గారు, మా అందరి తరపున మీకు నా ధన్యవాదాలు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.