మలయాళీ ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ స్కెచ్..!

0
288
Mohan Lal chief guest For Allu Arjun Ala Vaikunthapurramloo kerala pre Release Event
Mohan Lal chief guest For Allu Arjun Ala Vaikunthapurramloo kerala pre Release Event

(Allu Arjun Ala Vaikunthapurramloo kerala pre Release Event) సౌత్ ఇండియన్ స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే గాక ఇతర సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లో కూడా ఈ హీరోకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వేరే భాషల హీరోలను మనోళ్లు నెత్తిన పెట్టుకోవడమే చూశాం చాలా ఏళ్లు. ఐతే గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. ముఖ్యంగా కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి కొదవేలేదు. అందుకే ఆయన తాజా సినిమా అల.. వైకుంఠపురములో చిత్రాన్ని మలయాళం భాషలో “అంగు వైకుంఠపురత్తు” అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. ‘బాహుబలి’తో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. అతడి కంటే ముందు అల్లు అర్జున్ కేరళలో క్రేజ్ సంపాదించుకుని అక్కడ స్టార్ హీరోగా మారాడు.

ఐతే ఇప్పటిదాకా బన్నీ సినిమాలకు కేరళలో ఉన్న క్రేజ్ వేరు.. కేరళ రాష్ట్రంలో అభిమానులు అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని పిలుచుకొంటారు. ఇప్పుడు అతడి కొత్త చిత్రం ‘అల వైకుంఠపురములో’కు అక్కడ కనిపిస్తున్న హైప్ వేరు. బన్నీ గత చిత్రాల్ని తెలుగులో రిలీజయ్యాక కొంచెం గ్యాప్ ఇచ్చి కేరళలో రిలీజ్ చేసేవాళ్లు. ఈ నేపథ్యంలో బన్నీ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా భారీ ప్రమోషన్స్ నిర్వహిస్తూ వస్తోంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా.. తెలుగు ప్రేక్షకులకు ఎలాగైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి స్పెషల్ ట్రీట్ ఇచ్చారో, అలాగే మలయాళీ ప్రేక్షకులకు కూడా ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ చేసిందట అల.. వైకుంఠపురములో చిత్రయూనిట్. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రానున్నారని టాక్. చూడాలి మరి ఈ ఈవెంట్ ఎంత ఘనంగా నిర్వహిస్తారో!.

జీపీ లాంటి ప్రముఖ మలయాళ నటుల్ని.. వాళ్లకు పరిచయం ఉన్న సముద్ర ఖని లాంటి తమిళ నటుడిని తన సినిమాలో కీలక పాత్రలకు తీసుకుని స్ట్రాటజిగ్గా అడుగేశాడు బన్నీ. ఈ నెల 12న కేరళలో ‘అల..’ను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. అక్కడ పెద్ద హీరోల సినిమాల స్థాయిలో విడుదల ఉండబోతోంది. విశేషం ఏంటంటే.. కేరళ బన్నీ ఫ్యాన్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 30 స్పెషల్ షోలు ప్లాన్ చేస్తుండటం విశేషం. తమిళనాడు, కేరళల్లో స్టార్ హీరోల సినిమాలు రిలీజైనపుడు తెల్లవారుజామున బెనిఫిట్ షోలు వేయడం మామూలే. ఐతే ఓ పరభాషా కథానాయకుడి నుంచి వస్తున్న సినిమాకు కేరళలో 30 బెనిఫిట్ షోలు వేయడమంటే చిన్న విషయం కాదు.ఓ తెలుగు హీరో ఇలాంటి ఘనత సాధించడం విశేషమే.