మల్టీస్టారర్ గా ప్రభాస్ సలార్ మూవీ.. నిజమేనా ?

0
1324
Mohanlal And Daggubati Rana May Act In Prabhas Salaar Movie

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో కలిసి సలార్ అనే చిత్రం కోసం జతకడుతున్నారు. ఈ చిత్రం యొక్క అధికారిక ప్రకటన ఈ మధ్యనే వచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ‘ది మోస్ట్ వైలెంట్ మెన్..కాల్డ్ వన్ మ్యాన్ .. మోస్ట్ వైలెంట్’ అనే శక్తివంతమైన క్యాప్షన్ బట్టి ఈ చిత్రం నీల్ స్టైల్ లో మాస్ మసాలా ఎంటర్టైనర్ కానుందని తెలుస్తుంది.

బాహుబలి, బాహుబలి-2 చిత్రాల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన ప్రభాస్‌ బాలీవుడ్‌లోనూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ షూటింగ్ ప్రారంభం కానుంది. నిన్న సలార్ సినిమాలోని ఆర్టిస్టుల కోసం ఈ నెల 15న హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఆడిషన్స్ నిర్వహించబోతున్నారు. బెంగళూరు, చెన్నై నగరాలలో కూడా త్వరలో ఆడిషన్స్ ఉంటాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మరో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక పాత్రల్లో దగ్గుబాటి రానా, మోహన్‌లాల్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రానా-ప్రభాస్ కలిసి బాహుబలి సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు మోహన్‌లాల్ తెలుగులో ఎన్టీఆర్‌తో కలిసి ‘జనతా గ్యారేజీ’ సినిమాలో నటించారు. ఆయన ఉంటే సినిమాకు మలయాళంలో కూడా బాగా మార్కెట్ పెరుగుతుంది. మరోవైపు… గతంలో కన్నడ లో ప్రశాంత్ నీల్ చేసిన ఉగ్రం అనే సినిమా ప్రభాస్ తో తీస్తాడని వార్తలు వచ్చాయి. తాజాగా ‘సలార్’లో ప్రభాస్‌తో కలిసి రానా, మోహన్‌లా్ కలిసి నటిస్తున్నారన్న వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇది నిజమో కాదో తెలియాలంటూ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.