కొవిడ్ వాక్సిన్ తీసుకొన్న నటుడు మోహన్ లాల్

311
Mohanlal Took Covid Vaacine From Amrita Hospital
Mohanlal Took Covid Vaacine From Amrita Hospital

ప్రముఖ నటుడు మోహన్ లాల్ కేవలం మలయాళంలోనే కాదు… బహుభాషల్లో నటిస్తూ… దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తాజా చిత్రం ‘దృశ్యం -2’ ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యి, విశేష ఆదరణ పొందుతోంది. ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ కూడా అవుతోంది.

 

 

తెలుగులో వెంకటేశ్ ‘దృశ్యం -2’ రీమేక్ ను ఇప్పటికే మొదలెట్టేశారు. ఇదిలా ఉంటే… మోహన్ లాల్ ఈ రోజు కొవిడ్ వాక్సిన్ తొలి విడుత టీకాను అమృత హాస్పిటల్ లో తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వాక్సిన్ ను అందించిన కంపెనీలకు, వైద్యసదుపాయాలు కల్పించిన హాస్పిటల్స్ కు ధన్యవాదాలు తెలిపారు. విశేషం ఏమంటే.

 

 

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి డా. హర్షవర్థన్ లతో పాటు కేరళ ముఖ్యమంత్రి విజయన్ పినరయ్ ను, ఐసిఎంఆర్ ఢిల్లీని తన ట్వీట్ లో మెన్షన్ చేసిన మోహన్ లాల్… ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శైలజా టీచర్ ను ట్యాగ్ చేశారు. మొత్తానికీ అటు కేంద్రంతోనూ, ఇటు రాష్ట్రంతోనూ కూడా సత్ సంబంధాలను మోహన్ లాల్ భలే మెయిన్ టైన్ చేస్తున్నారు!