Homeసినిమా వార్తలు'ధర్మచక్రం' ఫస్ట్ లుక్ విడుదల..!

‘ధర్మచక్రం’ ఫస్ట్ లుక్ విడుదల..!

Dharma Chakram: సంకేత్ తిరుమనీడి, మౌనిక చౌహాన్ జంటగా పద్మ నారాయణ ప్రొడక్షన్ బ్యానర్ లో నాగ్ ముంతా దర్సకత్వం లో తెరకెక్కిస్తున్న సినిమా ధర్మచక్రం. సందేశాత్మక కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.

Dharma Chakram: తాజాగా “ధర్మచక్రం” ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆనంద్ మరుకుర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు.. ప్రణయ్ రాజపూటి సంగీతం అందిస్తున్నారు.

దర్శకుడు నాగ్ ముంతా మాట్లాడుతూ.. ‘ ధర్మచక్రం మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిస్తున్నాము. సమాజంలో ఆడవాళ్ళపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఆకృత్యాల నేపథ్యంలోనే ఈ చిత్ర కథ ఉంటుంది. అమ్మాయిల స్వీయ రక్షణ ఎలా ఉండాలో ఈ సినిమాలో చూపిస్తున్నాము.

Monika Chauhan Dharma Chakram first look poster out now

హీరోయిన్ మోనిక చౌహన్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీ అనౌన్స్ చేస్తాము..’ అని తెలిపారు.

 

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY