RRR లో ఖరీదైన పాట కోసం రాజమౌళి స్పెషల్ ప్లాన్స్..!

0
463

RRR Song Updates: రాజమౌళి దర్శకత్వంలో NTR, Ram Charan చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ RRR సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సినిమాకు సంబదించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈ షెడ్యూల్ లో ఒక భారీ సాంగ్ షూటింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇందులో ఒకటి తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

‘RRR’ చిత్రంలోని ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అద్భుతమైన ట్యూన్ సమకూర్చినట్లు తెలుస్తోంది. ఇది సినిమాలో లాస్ట్ సాంగ్ గా ఉండబోతోంది. ఈ సాంగ్ కోసం 3 కోట్ల బడ్జెట్ కేటాయించారట. సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్న జక్కన్న.. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఔట్ పుట్ వచ్చేలా జాగ్రత్త పడుతుంటారు.

ఈ సాంగ్ లో నటీనటుల కాస్ట్యూమ్స్ కోసమే కోటి రూపాయల దాకా ఖర్చు చేశారని టాక్. సినిమాలో ఈ సాంగ్ చాలా స్పెషల్ గా సినిమాకే వన్ ఆఫ్ ది హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ పాట చిత్రీకరణను జక్కన్న యూరప్ లో ప్లాన్ చేసారట. దీని కోసం చిత్ర బృందం ఈ నెలాఖరున లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్ లో యూరప్ వెళ్లనున్నారట. ప్రస్తుతం మేకర్స్ దీని కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

The Making video of Roar of RRR

ఇక ఈ సినిమా ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అంతకుమించి అనిపించేలా ఉండాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు చేసే మ్యాజిక్ కు ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మాత్రమే కాదు నేషనల్ వైడ్ సినీ అభిమానులంతా ఫిదా అవుతారని అంటున్నారు.