ఇంటరెస్టింగ్ గా ‘మిస్టర్ & మిస్’ ట్రైలర్

305
mr-miss-movie-release-trailer-out
mr-miss-movie-release-trailer-out

అశోక రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మిస్టర్ & మిస్’. జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటిస్తున్నారు. ఈ సందర్బంగా ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ బట్టి చూస్తే.. ‘అమలాపురం ప్రాంతానికి చెందిన యువకుడు జాబ్ కోసం ముంబైకి వెళ్లడం, ముంబైకి చెందిన మోడ్రన్ యువతితో పరిచయం ఏర్పడటం.. ఆ యువకుడు ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడటం..

 

ఆ తరువాత ఇద్దరు ప్రేమలో పడటం..’ లాంటివి ట్రైలర్ లో చూపించే విధానం ఆకట్టుకుంది. మరి ఆ తర్వాతేమైంది..? అనేదే ఈ చిత్ర కథగా దర్శకుడు చూపించబోతున్నట్లు అర్ధమవుతుంది. కాగా, ‘మిస్టర్ అండ్ మిస్’ సినిమా ఈనెల 29న విడుదల అవుతోంది. మా ‘మిస్టర్ అండ్ మిస్’ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నామంటూ చిత్రబృందం తెలిపింది.