Mrps Founder Manda Krishna Madiga Clarifies Anchor Pradeep Role In 139 Molestation Case

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మిర్యాల గూడ మహిళ 139 మంది రేపు కేసు ఘటనపై సంచలన విషయాలను బయటపెట్టారు MRPS అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ. ఈ లిస్టులో సినీ, రాజకీయ, మీడియా ప్రముఖులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ లిస్టులో యాంకర్ ప్రదీప్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. అసలు ఆ మహిళ వెనుకు ఉన్నది ఎవరు? ఎందుకు ప్రముఖ యాంకర్ ప్రదీప్.. ఇతర సెలబ్రిటీల పేర్లను ప్రస్తావించింది అన్న విషయాలపై మీడియాతో మాట్లాడారు కృష్ణమాదిగ.

ఆయన మాట్లాడుతూ.. ఆ మహిళ తనపై 139 మంది రేప్ చేశారని చేస్తున్న ఆరోపణల్లో దాదాపు 40 శాతం మందికి అసలు ఈ కేసులో సంబంధమే లేదు. ఈ 139 మందిపై కేసులు పెట్టించి.. ఆ కేసుల ద్వారా వాళ్లను వేధించి ఆర్థిక లబ్ధి పొందడం కోసం.. రాజశేఖర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్ అనే వ్యక్తి కుట్ర పన్నారు. అంతేకాదు ఈ అమ్మాయిని తన కంట్రోల్‌లో పెట్టుకుని చాలా సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని స్పష్టంగా రుజువు అవుతోంది.

అలాగే ఈ కేసులో కీలకంగా ఉన్న డాలర్ బాబుని అరెస్ట్ చేస్తే.. ఈ ఎపిసోడ్ మొత్తం ముగుస్తుంది. ప్రారంభంలో మీసాల సుమన్.. ఎండ్‌కి వచ్చేసరికి డాలర్ బాబు ఈ కేసులో కీలకంగా ఉన్నారు. మధ్యలో కొన్ని ఘటనలు జరిగాయి. కొన్ని జరగకపోయినా కేసులు వచ్చేశాయి.

ప్రదీప్ ఏ కులం వాడు.. ఏ మతం వాడు అని కాదు.. అనవసరంగా బాధ పెట్టకూడదు. కేవలం ఈ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి.. ఆమెపై అత్యాచారం చేసి.. నువ్ నా మాట విని పలానా వాళ్లపై కేసు పెట్టకపోతే.. నిన్ను కూడా చంపేస్తాం అని బెదిరించి ఆమెను చిత్ర హింసలకు గురి చేశారు. కేవలం డాలర్ బాబు బెదిరింపులకు చిత్ర హింసలకు భయపడే ఈమె సెలబ్రిటీల పేర్లను, మరికొందరి పేర్లను ఇందులో పెట్టింది తప్ప ఈ కేసులో వాళ్లకు సంబంధం లేదు.

యాంకర్ ప్రదీప్‌కి ఈ కేసుకు సంబంధం లేదు.. అతను అత్యాచారం చేయలేదు. అలాగే కవిత పీఏ ఆమెపై అత్యాచారం ఒడికట్టలేదు కాని.. నీ దగ్గర ఉన్న ఫొటోలు పంపమని మాత్రం బెదిరించినట్టు తెలుస్తోంది.ఈకేసులో అమాయకుల్ని, కేసుతో సంబంధం లేని వాళ్లని అరెస్ట్ చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా’ అంటూ సంచలన విషయాలను బయటపెట్టారు కృష్ణమాదిగ.