ఎంఎస్ రాజు మరో రొమాంటిక్ ‘7 డేస్ 6 నైట్స్’

7 Days 6 Nights Movie: దర్శకుడిగానూ గత ఏడాది ‘డర్టీ హరి’తో భారీ విజయం అందుకున్నారు. అయితే డర్టీ హరి తర్వాత రాజు తెరకెక్కిస్తున్న చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. టైటిల్ చూస్తేనే ఈ సినిమా కూడా ఈ కాలం యువతను బేస్ చేసుకొని తెరకెక్కిస్తున్నట్లు అర్ధమవుతుంది.

వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. దీనికి నిర్మాతలుగా సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్ వ్యవహరించనున్నారు. అయితే లాక్డౌన్ ముగియడంతో సినిమా షూటింగ్స్ అన్ని మొదలవుతున్నాయి. తాజాగా ఎంఎస్ రాజు కూడా షూటింగ్ కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించి మేకింగ్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ “ఎన్నో మెగా హిట్ చిత్రాలను నిర్మించిన మా నాన్నగారి సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఈ ‘7 డేస్ 6 నైట్స్’ సమర్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడిగా మరో భారీ విజయానికి నాన్నగారు శ్రీకారం చుడుతున్నారు. జూన్ 7న చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నాం. కొంత హైదరాబాద్… మరికొంత గోవా, మంగుళూరు, అండమాన్ నికోబర్ దీవుల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం. ‘డర్టీ హరి’తో తన సత్తా చూపించిన నాన్నగారు, మరో విభిన్నమైన జానర్ లో ఈ సినిమా చేయనున్నారు” అని అన్నారు.

ఎంఎస్ రాజు మాట్లాడుతూ “యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఈ సినిమా ఉంటుంది. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. సంగీతం, ఇతర సాంకేతిక అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిస్తాం. గత ఏడాది నా దర్శకత్వంలో వచ్చిన ‘డర్టీ హరి’తో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి, చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ప్రశంసలు మరువలేనివి. చాలామంది పెద్దవాళ్ళు నేను గొప్పగా తీశానని మెచ్చుకున్నారు. నా పుట్టినరోజు సందర్భంగా ‘డర్టీ హరి’కి నాకు అండగా నిలబడి, నన్ను వెన్నంటి ప్రోత్సహించిన నిర్మాత గూడూరు శివరామకృష్ణగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ చిత్రానికి కూడా ఆయన వెన్నంటే ఉంటారు. ‘డర్టీ హరి’ని మించి ఈ సినిమా ఉంటుంది” అని అన్నారు.

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles