much awaited prabhas birth day cdp released

Prabhas:  అభిమాన హీరోల పుట్టిన రోజు వచ్చిందంటే ఫ్యాన్స్ చేసే హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ మధ్యకాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కడం, దేశంలోని ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రావడంతో మరో అడుగు ముందుకేసి CDP లతో ట్విట్టర్ లో ఓ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మరో మూడు రోజుల్లో అనగా అక్టోబర్ 23వ తేదీన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన బర్త్ డే సీడీపీ రిలీజ్ చేశారు. ఇక సంబరాలు షురూ అంటూ ప్రభాస్ రేంజ్ తెలిపేలా బర్త్ డే సీడీపీని బయటకు వదిలారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కీర్తిని చాటిచెప్పేలా చైనా – జపాన్ – నార్త్ ఇండియా నుంచి కూడా ప్రేమను పొందుతున్నట్లు చూపించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.

దీంతో ఈ సీడీపీ నెట్టింట వైరల్ అవుతోంది. ఆయనకు పెద్ద ఎత్తున అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఇదలావుండగా డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ”రాధే శ్యామ్” చిత్రం నుంచి ‘బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్’ పేరుతో మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ – ప్రమోద్ – ప్రశీద నిర్మిస్తున్నారు.