Ram Charan Daughter – Ambani Golden Cradle gift: రామ్ చరణ్ అలాగే ఉపాసన దంపతులకు కూతురు పుట్టిన విషయం తెలిసిందే. మెగా ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు. ఆ రోజు మెగా ప్రిన్సెస్ (Mega Princess) పుట్టటంతో. సోషల్ మీడియాలో మెగా ప్రిన్సెస్ అంటూ యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతూ వచ్చింది. జూన్ 20న పుట్టిన ఈ మెగా ప్రిన్సెస్ జాతకం కూడా చాలా బాగుంది అంటూ పండితులు అలాగే చాలా ఫేమస్ జాతకాలు చెప్పే వాళ్ళు కూడా వీడియోలను విడుదల చేయడం జరిగింది.
రామ్ చరణ్ (Ram Charan) ఉపాసన దంపతులకు పుట్టిన మెగా ప్రిన్సెస్ కి (Mega Princess) టాలీవుడ్ సెలబ్రిటీస్ నుండి అలాగే బిజినెస్ సెలబ్రిటీస్ అందరూ విష్ చేయటం జరిగింది. మెగా అభిమానులైతే ఎవరి పోలికలతో పుట్టిందో అలాగే ఎప్పుడెప్పుడు చూద్దామా మెగా ప్రిన్సెస్ ని అని ఆత్రుతల్లో ఉన్నారు. అలాగే ఈరోజు మెగా ప్రిన్స్ బారసాల కావడంతో పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ రామ్ చరణ్ ఉపాసన దంపతుల కూతురుకి ఊహించని గిఫ్ట్ ఒకటి ఇవ్వటం జరిగింది.
ముఖేష్ అంబానీ ( Mukesh Ambani ) దంపతులు స్వయంగా హైదరాబాద్ కి వచ్చి రామ్ చరణ్ కూతురుకు బంగారు ఉయ్యాల ( Golden Cradle) గిఫ్ట్ గా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ ఉయ్యాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా ఫాన్స్ అయితే మెగా వారసురాలకి మెగా గిఫ్ట్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏం పేరు పెడుతున్నారో కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అలాగే రామ్ చరణ్ స్నేహితుడు శర్వానంద్ కూడా మెగా ప్రిన్స్ (Mega Princess) కోసం కోసం ఊహించని విధంగా గిఫ్ట్స్ పంపించారని తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఏర్వానంద్ రామ్ చరణ్ కూతురుకు ఏడాది వయసు వచ్చేవరకు కావాల్సిన బట్టలు బేబీ ప్రొడక్ట్స్ అలాగే బొమ్మలు కూడా గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి మెగా హీరోలు అల్లు అర్జున్, సాయి ధరంతేజ్, వరుణ్ తేజ్ ఎలాంటి గిఫ్టులు ఇస్తారో చూడాలి.