పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కిన ముమైత్‌ ఖాన్..

0
411
mumaith khan police complaint against cab driver on bill allegations

Cab Bill Issue: Mumaith Khan: నటి ముమైత్ ఖాన్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందని హైదరాబాద్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజు సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడమే గాక, క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. క్యాబ్ బిల్లు విషయంలో తనపై ఆరోపణలు చేస్తున్న డ్రైవర్‌పై నటి ముమైత్‌ ఖాన్‌ గురువారం పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తనకు క్యాబ్ డ్రైవర్‌ను‌ చీట్ చేయాల్సిన అవసరం లేదని, అతను తనపై తప్పుడు ఆరోపణలు చేశాడని ముమైత్ పేర్కొంది. కొన్ని మీడియా ఛానళ్లు తన పరువుకి భంగం కలిగేలా వార్తలు ప్రసారం చేశాయని ఆవేదన చెందింది. క్యాబ్ డ్రైవర్ చెప్పిన దాంట్లో నిజం లేదని.. అతని రాష్ డ్రైవింగ్ వల్లే తాను భయాందోళనకు గురయ్యానని ముమైత్ చెప్పడం విశేషం. అతనికి ఇవ్వాల్సిన 23 వేల 500 రూపాయలు ఇచ్చేశానని, అలాగే టోల్‌గేట్‌లకు సంబంధించి పూర్తి డబ్బులు తానే కట్టానని పేర్కొంటూ పోలీస్ కంప్లైంట్ చేసింది ముమైత్ ఖాన్.

mumaith khan police complaint against cab driver

ఇక తన క్యాబ్‌లో గోవా టూర్‌ వెళ్లొచ్చిన ముమైత్‌ రూ.15 వేల వరకు బాకీ పడిందని రాజు అనే క్యాబ్‌ డ్రైవర్‌ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ మొత్తం తిరిగి చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులు గోవాకు కారు బుక్ చేసుకున్న ముమైత్ ఖాన్‌.. ఆ తర్వాత టూర్‌ని ఎనిమిది రోజులకు పొడిగించిందని రాజు తెలిపాడు. టోల్ చార్జీలకు, డ్రైవర్ అకామిడేషన్‌‌కు డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. మరో డ్రైవర్‌కు ఇలా జరగకూడదని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు.