ఇలాంటి జానర్‌లో అఖండ నే బెస్ట్ అవుతుంది: తమన్

0
544
Music director about Balakrishna Akhanda movie story
Music director about Balakrishna Akhanda movie story

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా మ్యూజిక్ డైరక్టర్ తమన్ మీడియాతో ముచ్చటించారు.

బోయపాటి శ్రీను బాలకృష్ణ గారి అండర్ స్టాండింగ్ చాలా గొప్పది. వారిద్దరూ కలిసి ఎన్ని వందల సినిమాలు చేసినా ఫ్లాప్ అవ్వవు. కరోనా వల్ల సినిమాలో మార్పులు వచ్చాయి. కాలానికి తగ్గట్టుగా మార్చుకుంటూ వచ్చాను. విడుదలయ్యే టైంకు తగ్గట్టు మ్యూజిక్ ఉండాలి. అందుకే మళ్లీ రీరికార్డింగ్ చేశాను. ఈ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. మంచి రేసుగుర్రంలా బోయపాటి గారు పరిగెత్తారు. మా అందరినీ పరిగెత్తించారు.

ఈ సినిమాలో ఫైర్ ఉంది. ఇందులో ఎమోషన్ బాగుంటుంది. ఎమోషన్ బాగుంటే సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతాయి. బాలయ్య గారు అదరగొట్టేశారు. ఇది పర్ఫెక్ట్ మీల్‌లాంటి సినిమా. అఘోర పాత్రల మీద రీసెర్చ్ చేశాను. ఆ పాత్రలకు తగ్గట్టుగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టాం. చాలా బాగా వచ్చింది. ఈ కథ నెవ్వర్ బిఫోర్ అని.. నెవ్వర్ అగైన్ అని కూడా చెప్పొచ్చు. టైటిల్ సాంగ్ విని బాలయ్య గారు మెచ్చుకున్నారు. కమర్షియల్ సినిమాలకు త్వరగా ఏజ్ అవుతుంది. కానీ బోయపాటి గారు ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు.

Music director about Balakrishna Akhanda movie story
Music director about Balakrishna Akhanda movie story

ఈ సినిమాకు దాదాపు ఐదారు వందల మంది పని చేశారు. చాలా ప్రయోగాలు చేశాం. కేవలం సింగర్లే 120 మంది వరకు ఉంటారు. అఘోరాల గురించి చాలా రీసెర్చ్ చేశాం. సినిమాలో అఘోర పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో రేంజ్ మారిపోతోంది. వేరే జోన్‌లో ఉంటుంది. బాలయ్య గారితో తదుపరి చిత్రాన్ని కూడా చేస్తున్నాను. ఆయన సైన్స్‌ను నమ్మే వ్యక్తి. టైంను ఎక్కువగా నమ్ముతారు. ఎంతో లవ్లీ పర్సన్.

Also Read: భారీ ధరకు “అఖండ” రైట్స్ సొంతం చేసుకున్న దిల్ రాజు

Music director about Balakrishna Akhanda movie story
Music director about Balakrishna Akhanda movie story

Also Read: అఖండ ప్రీరిలీజ్ బిజినెస్..టార్గెట్ ఎంతంటే..!

ఇందులో శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు అద్భుతంగా కనిపిస్తారు. నంబర్ గేమ్‌ను నేను నమ్మను. అది మైండ్‌లో ఉంటే పరిగెత్తలేం. నంబర్ అనేది గుర్రాలకు జంతువులకు ఉంటుంది. మనకు ఉండకూడదు. మనం రోజూ కష్టపడుతూ ముందుకు వెళ్లాలి. అని చెపారు..

 

Web Title: Music director about Balakrishna Akhanda movie story. Akhanda pre Release event photos, akhanda trailer release date..

Previous articleAkhanda: Pre-release event date & venue revealed
Next articleబంఫర్‌ ఆఫర్‌ కొట్టేసిన రష్మీ.. !