Anirudh – Allu Arjun Movie: నేషనల్ అవార్డు విన్నింగ్ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగింది సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో. పుష్ప సినిమాతో హిందీ లో తనకి ఎనలేని క్రజ్ ఏర్పడింది. అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 shooting లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఆగస్టు 25న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించటం జరిగింది. అయితే ఇప్పుడు దర్శకుడు అట్లీ అలాగే అల్లు అర్జున్ మూవీ గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది.
Anirudh – Allu Arjun Movie: ఈ విషయానికి వెళ్తే, షారుక్ ఖాన్ హీరోగా రీసెంట్ గా విడుదల అయిన దర్శకుడు అట్లీ సినిమాకి సినీ సెలబ్రిటీస్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. దీనిలో అల్లు అర్జున్ కూడా ఒకరు అయ్యారు. అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా షారుఖాన్ అలాగే అట్లీ సినిమా అయినా జవాన్ గురించి ప్రశంసలు కురిపించారు.
దానిగాను ఈ సినిమాకి పనిచేసిన మ్యూజిక్ దర్శకుడు అనిరుద్ థాంక్స్ అంటూ రిప్లై ఇవ్వటం జరిగింది. అనిరుధ్‌కి థాంక్స్ అని సమాధానం చెప్పగా, సింపుల్ థాంక్స్ ఫర్వాలేదని, గొప్ప పాటలు ఇవ్వాలని అనిరుధ్‌కి చెప్పాడు అల్లు అర్జున్.కాబట్టి అనిరుధ్ రవిచందర్ మరియు అల్లు అర్జున్ యొక్క ఈ ఫన్నీ ఇంటరాక్షన్ అట్లీ మరియు అల్లు అర్జున్ కాంబో వార్తలను మరింత వైరల్ చేసింది.

దీంతో అల్లు అర్జున్ – అట్లీ – అనిరుద్ మూవీ నిజమే అంటూ అందరూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. తెలుస్తున్న విషయం ఏమిటంటే త్రివిక్రమ్ అలాగే అల్లు అర్జున్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తుంది. మరికొన్ని రోజులు పోతే గాని దీనిపై క్లారిటీ అనేది రాదు.