“అఖండ” బీజీఎం వర్క్ స్టార్ట్ చేసిన తమన్..!

Balakrishna AKhanda: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రానున్న ‘అఖండ’ సినిమాపై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలో బ్లాక్‌బస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ హింట్ ఇచ్చేశాడు. ఈ సినిమా బీజీఎం వర్క్స్ నేటి నుంచి ప్రారంభించబోతున్నానని తెలిపాడు. అంతేకాదు అఖండ ఫస్ట్ సింగిల్ అప్డేట్ త్వరలోనే రాబోతుందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే విడుదలైన ఫొటోలు, టీజర్లతో ఫుల్ ఖుషీలో ఉన్నారు బాలకృష్ణ ఫ్యాన్స్‌.

ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. నటి పూర్ణ ఓ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Music director Thaman give hint on Balakrishna Akhanda first single

Also Read: అఖండ’ ఫైనల్ షెడ్యూల్.. రిలీజ్ డేట్ పై క్లారిటీ..!

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ అవుతుందని తొలుత బజ్ వినిపించినా ఇప్పుడు ఆ డేట్ మారిందన్న ప్రచారం ఫిలిం సర్కిల్లో జరుగుతుంది.

- Advertisement -

Also Read: చిరు లూసిఫర్ కోసం సిద్దమైన తమన్ 

 

Related Articles

Telugu Articles

Movie Articles