Music Director Thaman Roped For Pawan Kalyan Pink Telugu Remake Movie
Music Director Thaman Roped For Pawan Kalyan Pink Telugu Remake Movie

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ లేకుండానే ‘పింక్’ తెలుగు రీమేక్‌ను లాంచ్ చేసేశారు. రాజకీయాల్లోకి వెళ్లాక పవన్ మళ్లీ సినిమాల్లోకి రారేమోనని అభిమానులు ఎంతో నిరుత్సాహపడ్డారు. కానీ లక్కీగా పవన్ ‘పింక్’ రీమేక్‌లో నటిస్తానని ఒప్పుకోవడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. రాజకీయాల్లో మంచి ఫామ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పటికప్పుడు సినిమాలు చేస్తే ఎవరేం అనుకుంటారో తెలియదు కానీ.. తెలుగు సినిమా థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కళకళలాడతాడు.కానీ.. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ విషయంలో ఈ అనవసరమైన సస్పెన్స్ ఎందుకు అనేది మాత్రం తెలియడం లేదు.

“పింక్” తెలుగు రీమేక్ నిన్న దిల్ రాజు ఆఫీసులో ప్రారంభోత్సవం జరుపుకొంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం దర్శకత్వం వహించనున్నాడని ప్రకటించారు.ఇప్పటికే పవన్ కోసం ఓ రాకింగ్ ట్యూన్‌ని కంపోజ్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. పవన్ సినిమాకు తమన్ తొలిసారి ట్యూన్స్ అందించబోతున్నారు. కాబట్టి పవన్‌ సినిమాకు ఉర్రూతలూగించే మ్యూజిక్ అందిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే హీరోయిన్‌తో రొమాన్స్‌లకు, వారి మధ్య వచ్చే పాటలకు, డ్యాన్స్‌లకు ఆస్కారం లేని సినిమా కాబట్టి పవన్‌ స్టైల్‌కు కథ మూడ్‌కు తగ్గట్టుగా సరిపోయే పాటను తమన్ కంపోజ్ చేశారట.

ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి కీలకపాత్రలు పోషించనున్నారన్న విషయం కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. హిందీలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించారు.నలుగురు మహిళలపై అత్యాచారం జరిగితే వారికి న్యాయం చేయడానికి ఓ న్యాయవాది ఏం చేశాడు అన్నదే ఈ సినిమా కథ. ‘పింక్’ను తమిళంలో ‘నేర్కొండ పార్వాయ్’ టైటిల్‌తో రీమేక్ చేశారు. అందులో అజిత్ ప్రధాన పాత్రలో నటించారు. సినిమా మంచి విజయం అందుకుంది. తెలుగులోనూ వర్కవుట్ అవుతుందని భావించి పవన్ కళ్యాణ్‌ను ఎంపిక చేశారు.