సీబీఎస్ఈ ఇంటర్మీడియట్ ఫలితాలు శుక్రవారం రోజున విడుదలైన సంగతి తెలిసిందే. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజమాబాద్ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తక్కువ మార్కులు తెచ్చుకోవటంతో ఇటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై మ్యూజిక్ స్కూల్ దర్శకుడు పాపారవు బియ్యాల స్పందించారు.
పాపారావు బియ్యాల ఐఏఎస్ ఆఫీసర్‌గా వర్క్ చేశారు. ఆయన మ్యూజిక్ స్కూల్ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఇసైజ్ఞాని, మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించటంతో పాటు నిర్మించారు. పిల్లలతో కళల పట్ల ఆసక్తిని పెంపొందించాల్సిన తల్లిదండ్రులు, టీచర్స్, సమాజం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. విద్యార్థులపై విద్యాపరమైన ఒత్తిడిని పెంచేస్తోంది. ఇది వారిలోని ఎదుగుదలను ఆపేస్తోంది. ఈ విషయాన్ని మ్యూజిక్ స్కూల్ అనే మల్టీలింగ్వువల్ చిత్రం ద్వారా ఎంటర్‌టైనింగ్‌గా వివరించారు. డ్రామా టీచర్‌గా శర్మన్ జోషి, మ్యూజిక్ టీచర్‌గా నటించిన శ్రియా శరన్.. ఓ లొకేషన్‌లో తల్లిదండ్రులు, టీచర్స్ ద్వారా విద్యాపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న కొంత మంది పిల్లలతో కలిసి సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనే సంగీత నాటకాన్ని రూపొందించటానికి కష్టపడటమే మ్యూజిక్ స్కూల్ ప్రధాన కథాంశం.
హైదరాబాద్, నిజమాబాద్‌లలోజరిగిన ఘటనలపై దర్శకుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ ‘‘చుట్టూ సమాజం కారణంగా వారు నిర్ణయించుకున్న కొన్ని ప్రమాణాల కారణంగా గొప్ప సామర్థ్యం ఉన్న కుర్రాడు తన ప్రాణాలను కోల్పోవటం మన దురదృష్టం. ఈ విషయాన్నే మా మ్యూజిక్ స్కూల్ చిత్రం ద్వారా తెలియజేశాం. విద్యార్థుల శ్రేయస్సు, అభివృద్ధి ముఖ్యమని తెలియజేసేలా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన మ్యూజిక్ స్కూల్ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.
మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సారథ్యం వహించిన ఈ చిత్రంలో శ్రియా శరన్, శర్మన్ జోషి, ప్రకాష్ రాజ్, ఓజు బారువా, గ్రేసీ గోస్వామి, బెంజిమన్ గిలాని, , సుహాసిని ములె, మోనా, లీలా సామ్‌సన్, బగ్స్ భార్గవ, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, వకార్ షేక్, ఫణి, ఇతర చిన్న పిల్లలు.
యామిని ఫిల్మ్స్ బ్యానర్ సమర్పణలో తెలుగు, హిందీ భాషల్లో రూపొందించిన ఈ చిత్రాన్ని తమిళంలో అనువాదం చేసి మే 12న రిలీజ్ చేశారు. హిందీలో పి.వి.ఆర్ రిలీజ్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.
Web Title: Music School director Paparao Biyyala opens up about the suicides of a students in Hyderabad, Telangana due to academic pressure, Music School, Shriya Saran, Paparao Biyyala