Bro Movie First Single Released: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) -సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) మొదటిసారిగా కలిసిన నటిస్తున్న సినిమా బ్రో. ఈ సినిమాని సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. సినిమా మొదలైన దగ్గరినుండి మేకర్స్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో బ్రో సినిమా నుండి మొదటి సాంగు మై డియర్ మార్కండేయ (My Dear Markandeya song) ఈరోజు విడుదల చేయడం జరిగింది.
Bro Movie First Single Released: త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అలాగే డైలాగులు రాస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. మై డియర్ మార్కండేయ (My Dear Markandeya song) పాటను రేవంత్, స్నిగ్ధ శర్మ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. పవన్ కళ్యాణ్ అలాగే సాయిధరమ్ తేజ్ ఈ సాంగ్ స్టైలిష్ లుక్ గా పంపించారు. అద్భుతమైన సినిమాటోగ్రఫీ మరియు ప్రొడక్షన్ డిజైన్ తో కన్నుల పండుగలా ఉంది పాట.
ఈ పాటలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్న ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) తన అందం, నాట్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఓవరాల్ గా చూసుకుంటే మై డియర్ మార్కండేయ ఓ డీసెంట్ మ్యూజికల్ నెంబర్ అది చెప్పవచ్చు. తమన్ అందించిన సంగీతం కూడా పాటకి హైలైట్ తెలుస్తుంది. దుస్తులు దగ్గర నుంచి ఛాయాగ్రహణం, నృత్యం, సంగీతం ఇలా ‘మై డియర్ మార్కండేయ’ పాటకు అన్నీ చక్కగా కుదిరాయి.
ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి(బ్రో)గా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా, మార్క్ అకా మార్కండేయులుగా సాయి ధరమ్ నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.