Shivathmika Rajashekar : హీరో రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే వారి కుమార్తెలు శివాత్మిక, శివానీ వెంటనే కోలుకోగా.. రాజశేఖర్, జీవిత హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. జీవితకు కూడా కరోనా నెగిటివ్ రాగా.. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఆయన కుమార్తె శివాత్మిక ట్వీట్ చేశారు.
ఆమె తన ట్వీట్లో రాస్తూ ‘కరోనాను ఎదుర్కోనడానికి నాన్న గట్టిగానే పోరాటం చేస్తున్నారు. అయితే పరిస్థితి కొంత క్లిష్టంగా ఉంది.. అయినప్పటికీ ఆయన బాగానే పోరాడుతున్నారు. ఈ సమయంలో మీ ప్రార్థనలు, మీ ప్రేమే ఆయన్ని కాపాడుతాయి. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆయన పూర్తిగా కోలుకుని తిరిగి వస్తారు.. అంటూ ఆమె ట్వీట్ చేసింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై సినీ పరిశ్రమ ఆందోళన చెందుతోంది.