మైత్రీ మూవీ మేకర్స్ తో కళ్యాణ్ రామ్ సినిమా

0
216
mytri-movie-makers-announced-new-movie-with-kalyan-ram
mytri-movie-makers-announced-new-movie-with-kalyan-ram

తెలుగు చిత్ర సీమలోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు తమ నూతన సినిమాను ప్రకటించారు. ప్రొడక్షన్ నెంబర్ 14గా ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ సినిమా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కనుంది. ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు మరో దర్శకుడు రాజేంద్ర పరిచయం కానున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మార్చి రెండవ వారంలో ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పుకోదగ్గ హిట్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

 

 

సరికొత్త కథలను ఎంచుకొని ప్రేక్షకులను అలరించాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఇటీవల కళ్యాణ్ రామ్ రావణుడి పాత్రలో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమా ఇదేనా అని కూడా ఇప్పుడు సందేహాలు వస్తున్నాయి. అంతేకాకుండా నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ పలు సినిమాలు నిర్మిస్తున్నారు. ఎన్‌టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో రానున్న సినిమాకు కూడా సహ నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.

 

 

ప్రస్తుతం తను హీరోగా చేసేందుకు పలు వైవిధ్యమైన కథలను వింటున్నారు. అంతేకాకుండా దర్శకులతో కూడా సంప్రదింపులు చేస్తున్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా ఒకటి సిద్దం కానుందని కూడా వార్తలు వచ్చాయి. మరి ఆ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి.

Previous articleనిధి అగర్వాల్ కు గుడి కట్టిన అభిమానులు
Next articleరాధేశ్యామ్ లో ప్రభాస్ బట్టలకే రూ.6 కోట్లు ఖర్చు చేసారంట