నా కోసం అంటూ కృతి శెట్టి ప్రేమలో నాగ చైతన్య..!

Naa Kosam Lyrical Video Song From Bangarraju: సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో నాగార్జున (Nagarjuna) ద్విపాత్రాభినయం చేసి భారీ బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నారు. ఈ చిత్రం యొక్క సీక్వెల్ బంగార్రాజులో నాగ చైతన్య (Naga Chaitanya) మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు, ఇందులో నాగ్ టైటిల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈసారి, సీక్వెల్‌లో ఇద్దరు రొమాంటిక్ హీరోలతో మరింత సరదాగా ఉంటుంది అని అలాగే మరింత రొమాన్స్ ఉంటుంది అని భావిస్తునారు.

మేకర్స్ ఇప్పటికే చార్ట్‌బస్టర్ అయిన లడ్డుండా పాటతో సంగీత ప్రమోషన్లను ప్రారంభించారు మరియు ఇప్పుడు వారు రెండవ సింగిల్ నా కోసం (Naa Kosam Song) ముందుకు వచ్చారు. లడ్డుండ అనేది మాస్ మరియు ఫన్ నంబర్, అయితే నా కోసం అనేది సిద్ శ్రీరామ్ యొక్క మ్యాజికల్ వాయిస్‌తో కూడిన లవ్ అలాగే మెలోడీ సాంగ్.

నాగ చైతన్య (Naga Chaitanya), క‌ృతి శెట్టిల (Krithi Shetty) మధ్య మంచి కెమిస్ట్రీ ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. ఈ పాట చివర్లో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టిలు (Krithi Shetty) కనిపించారు. అనూప్ రూబెన్స్ మంచి సంగీతాన్ని అందించారు ఈ సాంగ్ కి. సిద్ శ్రీరామ్ తన క్లాసీ గాత్రంతో మ్యాజిక్ చేసాడు మరియు బాలాజీ యొక్క సాహిత్యం ఈ పాటకి మరింత ప్రాణం పోశాయి.

Naa Kosam Song From Nagarjuna Naga Chaitanya Bangarraju Movie
Naa Kosam Song From Nagarjuna Naga Chaitanya Bangarraju Movie

బంగార్రాజు (Bangarraju) చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం బంగార్రాజు (Bangarraju shooting) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మైసూర్‌లో గత నెలలో మొదలైన సుధీర్ఘమైన ఈ షెడ్యూల్ ఇంకా కొనసాగుతుందని తెలుస్తుంది. ఈ సినిమాని జనవరి 15వ రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నట్టు సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

 

Related Articles

Telugu Articles

Movie Articles