Homeసినిమా వార్తలుఒరిజినల్ స్టోరీ కి చాలా మార్పులు చేశాము: ద‌ర్శ‌కుడు బిన్నీ

ఒరిజినల్ స్టోరీ కి చాలా మార్పులు చేశాము: ద‌ర్శ‌కుడు బిన్నీ

Nagarjuna next Naa Saami Ranga remake movie revealed by director Vijay Binni, Naa Saami Ranga censor review, Naa Saami Ranga bookings, Naa Saami Ranga Review

Naa Saami Ranga remake movie: గత రెండు సంవత్సరాలుగా అక్కినేని నాగార్జున సంక్రాంతికి సినిమాని విడుదల చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ సంక్రాంతికి కూడా నాగార్జున నుండి నా స్వామి రంగా సినిమా రాబోతుంది. ఈ సినిమాని జనవరి 14న విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.. అలాగే ఆశిక రంగనాథ్ హీరోయిన్ గా చేస్తుంది.. నిన్నటితో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మరో రెండు రోజుల్లో సెన్సార్ కార్యక్రమాలకు వెళ్లబోతుంది..

Naa Saami Ranga: అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు విజయ్ బిన్నీ ఈ సినిమా గురించి కొన్ని కీలకమైన అంశాలను చెప్పడం జరిగింది. నా స్వామి రంగా సినిమా మొదలుపెట్టిన దగ్గర నుండి ఇది మలయాళం రీమేక్ సినిమా అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది అయినప్పటికీ మేకర్స్ గాని దర్శకుడు కానీ దీనిపై ఎటువంటి కామెంట్ చేయలేదు కాకపోతే ఇప్పుడు ఈ సినిమా మలయాళం లో హిట్ అయిన ‘పొరింజు మ‌రియ‌మ్ జోస్‌’కి రీమేక్ అని దర్శకుడు విజయ బిన్నీ స్పష్టం చేశారు.

”నేను స్వ‌త‌హాగా కొరియోగ్రాఫ‌ర్‌ని. ద‌ర్శ‌క‌త్వం చేయాలన్న‌ది నా క‌ల‌. ఓ క‌థ‌తో నాగార్జున ద‌గ్గ‌ర‌కు వెళ్లాను. అప్పుడు ఆయ‌న ఈ క‌థ వినిపించారు. దాన్ని నా స్టైల్ లో తీర్చిదిద్దా” అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే సినిమాలో నరేష్ అలాగే రాజ్ తరుణ్ణి తీసుకోవాలని కూడా నాగ్ ఆలోచన అని చెప్పారు అలాగే ఈ సినిమాలో ఐదు పాటలు ఉంటే నాలుగు పాటలు దర్శకుడు విజయ్ బిన్నీ కొరియోగ్రాఫ్ చేయటం జరిగిందంట. ఈ సినిమాతో దర్శకుడు విజయ్ బిన్నీ కెరియర్ ఎలా టర్నింగ్ అయిదో చూడాలి.

Director Vijay Binni about Naa Saami Ranga movie, Naa Saami Ranga malayalam remake movie, Nagarjuna, Ashika Ranganath, Naa Saami Ranga Trailer Release Date 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY