తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఏ ఇండస్ట్రీ కూడా ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకోలేదు. కానీ తెలుగులో మాత్రం థియేటర్స్ 100 శాతం ఆక్యుపెన్సీతో నడవడం.. వరస విజయాలు రావడం.. ఉప్పెన లాంటి సినిమాలు చరిత్ర సృష్టించడం కూడా జరిగిపోతున్నాయి. ఏడాది తర్వాత తొలిసారి ఫిబ్రవరి 19 శుక్రవారం 4 సినిమాలు విడుదలయ్యాయి. దాంతో పాటు ఓటిటిలో రెండు సినిమాలు వచ్చాయి. మరి వీటిలో ఏది ప్రేక్షకుల మెప్పు పొందింది చూద్దాం..
1. నాంది: అల్లరి నరేష్‌కు సుడిగాడు తర్వాత ఒక్క హిట్ కూడా లేదు. ఇలాంటి సమయంలో ఈయన నుంచి వచ్చిన నాంది సినిమాకు పాజటివ్ టాక్ వచ్చింది. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించాడు. హరీష్ శంకర్ తన తొలి సినిమా షాక్ కోసం తీసుకున్న లైన్‌నే శిష్యుడు విజయ్ కూడా తీసుకుని ఇండియన్ పీనల్ కోడ్‌పై కథ రాసుకున్నాడు. సీరియస్ సబ్జెక్టుతో వచ్చిన ఈ సినిమాలో నరేష్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. నరేష్‌కు దాదాపు 8 ఏళ్ళ తర్వాత వచ్చిన విజయం ఇది. తొలిరోజు ఈ సినిమాకు 50 లక్షల షేర్ వచ్చింది. సేఫ్ అవ్వడానికి 3 కోట్లు రావాలి.
2. చక్ర: అభిమన్యుడు లాంటి సినిమాతో తెలుగులో సంచలన విజయం అందుకున్న విశాల్.. ఇప్పుడు మరోసారి చక్రలో అలాంటి కథనే తీసుకొచ్చాడు. డిజిటల్ క్రైమ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఎంఎస్ ఆనందన్ తెరకెక్కించిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. రెజీనా ఈ సినిమాలో విలన్ కావడం విశేషం.
3. కపటదారి: కన్నడలో సూపర్ హిట్ అయిన కల్వదారి సినిమాకు రీమేక్ ఇది. సుమంత్ హీరోగా ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కించిన ఈ సినిమాకు కూడా యావరేజ్ టాక్ వచ్చింది. స్క్రీన్ ప్లే బాగానే ఉన్నా కథ వీక్ కావడంతో సుమంత్‌కు మరోసారి నిరాశ తప్పేలా లేదు.
4. పొగరు: ఖరాబు అంటూ ఒకేఒక్క పాటతో పొగరు సినిమాపై ఆసక్తి పెంచేసారు. కన్నడ హీరో ధృవ సర్జ నటించిన ఈ సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. కథలో దమ్ము లేకపోవడంతో అస్సలు ఆకట్టుకోలేకపోతుంది. కేవలం రష్మిక మందన్న ఇమేజ్‌పైనే విడుదలైన ఈ సినిమాకు వసూళ్లు కూడా చాలా వీక్‌గానే ఉన్నాయి.
5. దృశ్యం 2: మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సినిమా దృశ్యం 2. ఏడేళ్ళ కింద వచ్చిన దృశ్యం సినిమాకు రీమేక్ ఇది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయిన ఈ సినిమాకు అదిరిపోయే టాక్ వచ్చింది. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో వ్యూస్‌లో రికార్డులు తిరగరాస్తుంది.
6. పిట్ట కథలు: నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, నాగ్ అశ్విన్ లాంటి పేరున్న దర్శకులంతా కలిసి తెరకెక్కించిన వెబ్ సిరీస్ పిట్ట కథలు. ఫిబ్రవరి 19న నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైంది ఇది. దీనికి కూడా ఊహించిన టాక్ రాలేదు. ఒక ఎపిసోడ్ మినహాయిస్తే మిగిలిన మూడు నిరాశ పరిచాయని పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు.
7.”మిడ్ నైట్ మర్డర్స్” : ఈ యేడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘క్రాక్’ మూవీ ఫిబ్రవరి 5న ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఆ కమర్షియల్ హిట్ మూవీని స్ట్రీమింగ్ చేసిన సందర్భంగా గత శుక్రవారం గ్యాప్ ఇచ్చిన ఆహా ఓటీటీ సంస్థ ఈ ఫ్రై డే మలయాళ చిత్రం ‘అంజామ్ పాతిర’ను తెలుగు వారి ముందుకు తీసుకొచ్చింది. గత యేడాది జనవరి 10న విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కేరళలో ఘన విజయం సాధించింది. దీనిని తెలుగులో వి. రామకృష్ణ ‘మిడ్ నైట్ మర్డర్స్’ అనే పేరుతో డబ్ చేశారు. థ్రిల్లర్ జానర్ ను ఇష్టపడే వారికి ‘మిడ్ నైట్ మర్డర్స్’ నచ్చుతుంది.