Oscar Nominations 2023 List : ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పుడు రికార్డులను సృష్టిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాలోని నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకోగా ఇప్పుడు ఈ సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయింది.
Naatu Naatu Oscar Nominations List: ఈరోజు 95వ ఆస్కార్ నామినేషన్ల జాబితాను అధికారికంగా విడుదల చేయటం జరిగింది. ఈ జాబితాలో వివిధ కేటగిరీలో పలు సినిమాలు పోటీపడ్డాయి. అయితే ఈరోజు విడుదల చేసిన జాబితాలో ఆర్ఆర్ఆర్ సినిమా నుండి నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయింది.
దీనికోసం జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. అలాగే దర్శకుడు SS రాజమౌళి మరియు సంగీత స్వరకర్త MM కీరవాణికి దేశం మళ్లీ గర్వపడేలా చేసారు.
95వ ఆస్కార్ అవార్డులను మార్చి 12న హాలీవుడ్‌లోని లాస్ ఏంజెల్స్‌లో డాల్బీ థియేటర్లో ప్రదర్శించనున్నారు. నాటు నాటు ట్రోఫీని కూడా కైవసం చేసుకుంటుందని ఆశిస్తున్నాను. ఇంత గొప్ప విజయాన్ని సాధించినందుకు రాజమౌళి గారూ మరియు మొత్తం RRR టీమ్‌కి అభినందనలు.