గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన నాభా నటేష్..!

0
504
Nabha Natesh romance with Mahesh babu next film

Nabha Natesh, Mahesh Babu: హాట్ బ్యూటీ నబా నటేష్ కన్నడ సినిమా ‘వజ్రకాయ’ తో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత తెలుగు పరిశ్రమ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ అందులో భాగంగా నన్ను దోచుకుందువటే , డిస్కో రాజా వంటి సినిమాలలో నటించింది. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్మార్ట్ శంకర్ సినిమా తో ఈ ముద్దుగుమ్మకు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం దక్కింది.

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత నభా నటేష్ పలు సినిమాల్లో నటించినా ఆ సినిమాలు ఇస్మార్ట్ శంకర్ సినిమా స్థాయిలో సక్సెస్ ను అందుకోలేదు. నభా నటేష్ హీరోయిన్ గా నటించిన మ్యాస్ట్రో ఈ నెల 17వ తేదీన డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఇదిలా ఉంటే ముద్దుగుమ్మ నభా నటేష్ కు టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో అవకాశం వచ్చింది అంటూ ఒక వార్త ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.

మహేష్ సినిమాలో నభా నటేష్ నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మహేష్ మూవీలో అవకాశం అంటే నభా నటేష్ కు గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో నటించి ఆ సినిమా సక్సెస్ సాధిస్తే నభాకు ఆఫర్లు పెరిగే అవకాశం ఉంటుంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

Nabha Natesh romance with Mahesh babu next film

త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖాలేజా సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాలో ‘ఖాలేజా’ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహ పరచగా, ‘అతడు’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Previous articleTanya Ravichandran Latest Stills
Next articleGopichand Seetimaarr censor completed