ప్ర‌భాస్ సినిమా లెక్క‌లు, బాక్సాఫీస్ ఓపెనింగ్స్ ఎప్పుడూ ప‌ట్టించుకోడు

591
Nag Ashwin interview about Prabhas Movie

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ (‘మహానటి’ ఫేమ్‌) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతున్నది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ తెరకెక్కించనుంది. ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. నాగ్‌అశ్విన్‌ నిర్మాతగా అరంగేట్రం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘జాతిరత్నాలు’. నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా నాగ్‌అశ్విన్‌ ప్ర‌భాస్ గురించి పంచుకున్న ముచ్చట్లివి..

ప్ర‌భాస్ సినిమా ఇండియ‌న్ స్క్రీన్ మీద తెలుగు సినిమా స్టామినాని మ‌రో‌సారి చూపించ‌బోతుందా?
అని మీరు చెబితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. డెఫినెట్‌గా ఒక కొత్త త‌ర‌హా చిత్రం. స్క్రిప్ట్ కొత్త‌గా ఉంటుంది. ఆ సినిమాకి కావాల్సిన ప్ర‌పంచాన్ని సృష్టించ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. జులై నుండి ఫ‌స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం.

చివ‌ర‌గా ప్ర‌భాస్‌గురించి?
ప్ర‌భాస్ గారి ద‌గ్గ‌ర‌కు వెళ్లేట‌ప్పుడు పెద్ద స్టార్ అని ఒక హైప్‌తో వెళ్తాం.. కాని ఆయ‌న ఎంత కంఫ‌ర్ట‌బుల్ ఉంటారంటే మ‌నం హ్యాపీగా మాట్లాడొచ్చు. ఆయ‌న ఈ సినిమా లెక్క‌లు, బాక్సాఫీస్ ఓపెనింగ్స్ ఎప్పుడూ ప‌ట్టించుకోడు..సోష‌ల్ మీడియా మీద కూడా పెద్ద‌గా ఇంట్రెస్ట్ ఉండ‌దు. ఎప్పుడైనా మాట్లాడితే మా సినిమా గురించి కాని, ఆయ‌న చేస్తున్న ఇత‌ర సినిమాల స్టోరీస్ గురించే మాట్లాడుతారు. అందుకే ఆయ‌న అంత కూల్ గా ఉంటాడేమో..