ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా గురించి అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాధేశ్యాం రిలీజ్ అయిన తర్వాత తన ఖాతాలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సాగర్ అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్ కే ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమా గురించి ఈ రోజు ట్విట్టర్ ద్వారా అప్డేట్ ఇవ్వడం జరిగింది.

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు తన మూవీస్ షూటింగ్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి గా ఉంటారు, అలాగే ప్రభాస్ పుట్టిన రోజున ప్రాజెక్ట్ కె గురించి అప్డేట్ వస్తుందని అందరూ ఎదురు చూశారు. కానీ ఆరోజు నాగ్ అశ్విన్ ఎటువంటి అప్డేట్ను ఇవ్వలేదు. అప్పుడు నాగ్ అశ్విన్ ని అడిగితే… ‘రాధే శ్యామ్’ విడుదల తర్వాతే” అని చెప్పారు.

అయితే నాగ్ అశ్విన్ ట్వీట్ కోట్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ”అన్నా! గుర్తు ఉన్నామా?” అని అప్ డేట్ ని అడగటం జరిగింది. దానికి సమాధానం ఇస్తూ ”గుర్తు ఉన్నారు. ఇప్పుడే ఒక షెడ్యూల్ అయ్యింది. ప్రభాస్ గారి ఇంట్రో బిట్ తో సహా! ఆయన చాలా కూల్ గా ఉన్నారు.” అని చెప్పుకొచ్చారు.

Nag Ashwin gives major update about Prabhas Project K
Nag Ashwin gives major update about Prabhas Project K

దీనితో పాటు నాగ్ అశ్విన్ “జూన్ నెలాఖరు నుంచి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. రిలీజ్ ఆర్డర్ లో మనం లాస్ట్ కదా! వరుసగా అప్ డేట్స్ ఇవ్వడానికి టైమ్ ఉంది. అందరు ప్రాణం పెట్టి పని చేస్తున్నాం” అది చెప్పటంతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఈ న్యూస్ ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది.

ఒక ట్వీట్ తో నాగ్ అశ్విన్ ప్రభాస్ సినిమా సంబంధించి షూటింగ్ అప్డేట్ అలాగే ఎంత వరకు కంప్లీట్ అయిన విషయం కూడా తెలియజేశారు. ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ సంస్థ సినిమాని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది.

- Advertisement -

 

Related Articles

Telugu Articles

Movie Articles