జబర్దస్త్ లో వాళ్లకు మాత్రం యాజమాన్యం చెప్పేది ఒక్కటే

Naga Babu accuses Jabardasth organisers of starving the participants.
Naga Babu accuses Jabardasth organisers of starving the participants.

‘జబర్దస్త్’ కామెడీ షో షోకి కొన్ని సంవత్సరాలుగా(షో మొదలైన సమయం నుండి) న్యాయనిర్ణేతగా ఉన్న నాగబాబు ఇటీవలే ఆ షో నుండి తప్పుకున్నారు. కొంతమంది టీమ్ లీడర్లతో కలిసి నాగబాబు వేరే టీవీ ఛానల్లో సందడి చేయనున్నారు. జబర్దస్త్ ను వీడిపోడానికి కొన్ని కారణాలను.. ఆ షోతో ఆయనకు ఉన్న అనుబంధాలను చెప్పుకుంటూ వచ్చారు. రెమ్యునరేషన్ కారణంగానే ఆ షోను వదిలిపెట్టానని వచ్చిన రూమర్స్ కు ఆయన చెక్ పెట్టారు. ‘జబర్దస్త్’ షోకి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అయినప్పటికీ .. ఇది మల్లెమాల షో అని కొందరు .. ఈటీవీ షో అని మరికొందరు అన్నప్పటికీ నేను ఆ విషయాలను గురించి పెద్దగా ఆలోచించలేదన్నారు.. ఇది నా షో అనుకుని చేసేవాడినన్నారు. ‘జబర్దస్త్’కి సంబంధించిన వాళ్లమంతా ఒక కుటుంబంలా కలిసి ఉండేవాళ్లమనీ .. ఏ ఒక్కరికి కష్టం వచ్చినా మిగతా వాళ్లమంతా కలిసి ఆదుకునేవాళ్లమంటూ తమ అనుబంధాల గురించి చెప్పుకొచ్చారు. ఓడిపోయిన టీమ్ లీడర్స్ ఒక్కోసారి డిప్రెషన్‌ లోకి వెళ్లిపోయే వారని కూడా నాగబాబు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మానసికంగా ధైర్యం చెప్పి ముందుకు వెళ్లేలా కృషి చేశామని చెప్పారు.

జబర్దస్త్ మేనేజ్మెంట్ కార్పోరేట్ కంపెనీలాగే ఆలోచించి.. తమ షో ఒక్కటి బాగా వస్తే చాలు ఎవరు ఎటుపోతే తమకెందుకు అన్నట్లే ఆలోచించారని సంచలన వ్యాఖ్యలు చేశారు నాగబాబు. వేణువండర్స్‌పై దాడి జరిగితే కనీసం మల్లెమాల కానీ.. ఛానెల్ వాళ్లు కానీ ఒక్కముక్క కూడా మాట్లాడలేదని అన్నారు నాగబాబు. వేణు, ధనరాజ్ లాంటి వాళ్లు అందుకే బయటికి వెళ్లిపోయరేమో అని తెలిపారు నాగబాబు. ఇక ఆ తర్వాత సుడిగాలి సుధీర్, ఆర్పీ, భాస్కర్ లాంటి వాళ్లు టీం లీడర్స్ కావడంలో తాను కూడా కీలక పాత్ర పోషించానని చెప్పారు నాగబాబు. ఆ షో నిర్వాహకులైన మల్లెమాల సంస్థ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మంచి వ్యక్తి అని, అయితే ఆ సంస్థలో కొందరి వల్లనే మొత్తం జబర్దస్త్ షో కు ప్రస్తుతం నష్టం చేకూరే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. మల్లెమాలలో కొందరు మంచివారు ఉన్నప్పటికీ, మరి కొందరు సంస్థలో చేరి నష్టం చేకూరుస్తున్నారని అన్నారు. ఈ షో సమయంలో ప్రొడక్షన్స్ వాల్యూస్ దారుణంగా ఉండేవన్నారు నాగబాబు. జబర్దస్త్‌లో పనిచేసేవాళ్లు మల్లెమాల బాగుకోసమే కష్టపడేవాళ్లునీ.. కాని టీం లీడర్స్ గురించి పట్టించుకునేవాళ్లు కాదన్నారు. నన్ను బాగానే చూసుకున్నారు కాని మిగతా టీం వాళ్లకు ఫుడ్‌ కూడా సరిగా పెట్టేవారు కాదన్నారు. మినిమమ్ ప్రొడక్షన్ వాల్యూస్ లేకుండా రాను రాను మరీ తగ్గించేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు నాగబాబు.

ఇప్పటిదాకా పలు వీడియోలను నాగబాబు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అన్ని ఆరోపణలు వస్తున్నా మల్లెమాల మేనేజ్మెంట్ మాత్రం ఎటువంటి కౌంటర్ అటాక్ చేయలేదు. దీనిపై మల్లెమాల యాజమాన్యం అందులో పనిచేసే వాళ్లకు కొన్ని సూచనలు చేసిందట. ముఖ్యంగా ఎవరూ ఏమీ మాట్లాడకూడదని చెప్పారని ఇన్సైడ్ టాక్..! ‘జబర్దస్త్’ కంటెస్టెంట్లకు ముఖ్యంగా ఏమీ మాట్లాడవద్దని యాజమాన్యం సూచించిందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై అస్సలు స్పందించొద్దని, తొందరపడి పోస్టులు పెట్టొద్దని ఇప్పటికే సూచనలు అందినట్లు తెలుస్తోంది. నాగబాబు వ్యాఖ్యలపై స్పందించి ఆ వివాదం మరింత పెద్దదిగా చేయకూడదని యాజమాన్యం భావిస్తోంది.