Naga Chaitanya and Chandoo Mondeti New Movie: టాలీవుడ్ దర్శకుల్లో చందు మొండేటి కూడా ఒక టాలెంటెడ్ అలాగే వెజినరీ ఉన్న డైరెక్టర్. కదా బిజినరీ ఎలా ఉంటుందో కార్తికేయ సినిమా చూస్తే అర్థమవుతుంది. కార్తికేయ 2 విడుదలైన తరువాత దర్శకుడు చందు పాన్ ఇండియా ఆడియన్స్ ని కూడా మెప్పించడం జరిగింది. ప్రస్తుతం కార్తికేయ 3 సంబంధించిన పనుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడే నాగ చైతన్య నెక్స్ట్ మూవీ చందు డైరెక్ట్ చేస్తారు అంటూ సోషల్ మీడియాలో కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
Naga Chaitanya and Chandoo Mondeti New Movie: నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. మే 12న ఈ సినిమాని విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన టీజర్ అలాగే పోస్టర్లు సినిమాపై భారీగానే అంచనాలు పెంచేసాయి. చైతన్య ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. సినిమా తర్వాత నాగచైతన్య – చందు మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే, కార్తికేయ 2 తర్వాత చందు బాలీవుడ్ హీరోలతో సినిమా చేస్తున్నట్టు ప్రచారం నడిచింది. అయితే అక్కడ హీరో డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో ఈలోగా ఒక సినిమా చేయాలని కద రెడీ చేసుకున్నారంట.
అయితే ఈ కథను గీత ఆర్ట్స్ 2 ప్రొడ్యూసర్ బన్నీ వాసుకు కథ నచ్చి సినిమా నిర్మించేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ కథకు నాగచైతన్య అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని.. తన కూడా స్టోరీ లైన్ చెప్పగానే ఓకే అన్నట్టు సమాచారం. చందు మొండేటి డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు తీసుకువెళ్తారని తెలుస్తుంది.
నాగచైతన్య అలాగే చందు మొండేటి కలిసి ప్రేమమ్ రీమిక్స్ సినిమా చేసిన విషయం కూడా తెలిసిందే. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగానే హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో చిన్మరాటం నాగచైతన్య ఫ్యాన్స్ కి సంబరం అని చెప్పవచ్చు. ఈ సినిమా గురించి త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతుంది.