రివ్యూ: లవ్‌స్టోరి

0
6359
Love Story Telugu Review Rating

టైటిల్‌ : లవ్‌స్టోరి రివ్యూ
నటీనటులు : నాగ చైతన్య , సాయి పల్లవి, ఈశ్వరీరావు, రావు రమేశ్‌, పొసాని కృష్ణ మురళి తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినిమాస్
నిర్మాతలు : కె. నారాయణ్‌దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు
దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల
సంగీతం : పవన్‌ సీహెచ్‌
సినిమాటోగ్రఫీ : విజయ్‌.సి.కుమార్‌
ఎడిటింగ్‌: మార్తాండ్ కె వెంకటేష్
విడుదల తేది : సెప్టెంబర్‌ 24, 2021

‘ల‌వ్‌స్టోరి’ నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి నటించడం… శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం… ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకోవ‌డంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు నేడు( సెప్టెంబర్‌24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో తెలుసుకోవాలంటే ఈ లవ్‌స్టోరి రివ్యూ చూడాల్సిందే.

కథ:
చిన్నతనం నుంచి కుల వివక్ష తో, పేదరికంలో బ్రతుకుతూ ఏదో సాధించాలనే తపనతో ఓ ఫిట్ నెస్ సెంటర్ ను పెట్టీ జీవితం లో పైకి ఎదగాలనుకుంటాడు రేవంత్ (నాగ చైతన్య). సరిగ్గా అదేసమయంలో రేవంత్ ఫిట్నెస్ సెంటర్ కు పక్కనే ఫ్రెండ్ ఇంటికి జాబ్ కోసం వస్తుంది మౌని (సాయి పల్లవి). ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం పెరిగుతుంది. ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ చేసిన మౌని కి ఉద్యోగం రాకపోవడంతో ఆమె ఓ సందర్భంలో రేవంత్ స్టూడియోలో డాన్స్ చేస్తుంది.

Love Story Telugu Review Rating

ఆమె డ్యాన్స్ కి ఫిదా అయిపోయిన రేవంత్ తన ఫిట్ నెస్ సెంటర్ కు ఎక్స్ టెండ్ కోసం హెల్ప్ కావాలి అని చెప్పి ఆమెను పార్టనర్ గా తీసుకుంటాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో పడతారు అయితే మీరు ప్రేమలో గెలవడానికి కులం అనేది అడ్డు వస్తుంది దాన్ని ఎదిరించి తమ ప్రేమను ఎలా విజయ తీరాలకు చేకూర్చారు అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

నాగ చైతన్య
సాయి పల్లవి
పవన్ సంగీతం
డైరెక్షన్

మైనస్ పాయింట్స్ :

హడావుడి క్లైమాక్స్
అక్క‌డ‌క్క‌డా నెమ్మ‌దించే క‌థ

Love Story Telugu Review Rating

నటీనటులు:
నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి న‌ట‌న చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. వారిద్ద‌రూ రేవంత్‌, మౌనిక పాత్రల్లో ఒదిగిపోయారు. మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడిగా క‌నిపిస్తూ నాగ‌చైత‌న్య ప‌లికించిన భావోద్వేగాలు, ఆయ‌న ప‌లికిన తెలంగాణ యాస పాత్ర‌కి జీవం పోసింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తెరపై రేవంత్‌, మౌనిక పాత్రలు మాత్రమే కనిపిస్తాయి తప్ప సాయి పల్లవి, చైతూలు అస్సలు కనిపించరు.

ఇక ఈ సినిమాలోని ఇతర పాత్రధారులు అయిన రాజీవ్ కనకాల ఈశ్వరి దేవకి లు తమ పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించారు. ముఖ్యంగా రాజీవ్ కనకాల ఆ పాత్రలో ఒదిగిపోయాడు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ప‌వ‌న్ సీహెచ్ సంగీతం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. పాట‌లు హ‌త్తుకుంటాయి. ‘నీ చిత్రం చూసి’, ‘ఏవో ఏవో క‌ల‌లే’ పాట‌ల చిత్ర‌ణ సినిమాకి హైలైట్‌గా నిలిచాయి.

శేఖ‌ర్ క‌మ్ముల త‌న మార్క్ మేకింగ్‌తోనే ప్ర‌స్తుత స‌మాజానికి అవ‌స‌ర‌మైన కొన్ని అంశాల్ని స్పృశించారు. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

Love Story Telugu Review Rating

విశ్లేషణ:
క‌థానాయ‌కుడి జీవితాన్ని ప‌రిచ‌యం చేస్తూ నేరుగా క‌థ‌లోకి తీసుకెళ్లాడు ద‌ర్శ‌కుడు. మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడి క‌ష్టాలు… త‌న క‌ల‌ల్ని తెర‌పై చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. అదే స‌మయంలో క‌థానాయిక త‌న క‌లల్ని సాకారం చేసుకోవ‌డానికి హైద‌రాబాద్ చేరుకుని చేసే ప్ర‌య‌త్నాలు, ఆ క్ర‌మంలో ఆమెకి ఎదుర‌య్యే ఇబ్బందులు హ‌త్తుకుంటాయి.

నాగ చైతన్య మరియు సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ తెరపై మనోహరంగా ఉంది మరియు ప్రొసీడింగ్‌లకు చాలా లోతును తెస్తుంది. రేవంత్ మరియు మౌనిక పాత్రల ఉనికి కోసం పోరాటం మొదటి భాగంలో ప్రామాణికమైన రీతిలో ప్రదర్శించబడ్డాయి.

Love Story Telugu Movie Review and Rating

కులంతోపాటు ఇళ్ల‌ల్లో అమ్మాయిల‌పై జ‌రిగే లైంగిక హింస వంటి సంక్లిష్ట‌మైన అంశాల్ని స్పృశిస్తూ ప్రేమ‌క‌థ‌ని తీశారు. బ‌య‌టికి చెప్ప‌డానికి, మాట్లాడుకోవ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని లైంగిక దాడుల గురించి ఓ ప్రేమ‌క‌థ ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌డం మంచి ప‌రిణామం. ద్వితీయార్ధంలో అస‌లు ప్రేమ‌క‌థ మొద‌ల‌వుతుంది. రేవంత్‌, మౌనిక ప్రేమకి ఎదుర‌య్యే స‌వాళ్లు, ఊళ్లో ప‌రిస్థితులు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి.

క‌థ చివ‌రి ద‌శ‌కు చేరుకునే క్ర‌మంలో వ‌చ్చే స‌న్నివేశాలు మ‌న‌సుకు భారంగా అనిపిస్తాయి. శేఖర్ కమ్ముల తాను ఎంచుకున్న పాయింట్‌ని చక్కగా ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకులకి వినోదం పంచే ప్రయత్నం చేశాడు.

 

Previous articleLove Story Review: Engaging to an extent
Next articleసక్సెస్‌ఫుల్ మాస్‌ డైరెక్టర్‌తో రామ్ పోతినేని నెక్ట్స్..!