‘లవ్‌స్టోరి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..!

0
688
Naga Chaitanya and Sai Pallavi Love Story theatrical release on Sep 10

Love Story Release Date: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లలో విడుదలవుతున్న ప్రెస్టీజియస్ మూవీ “లవ్ స్టోరి” కావడం విశేషం. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. సెప్టెంబర్ 10న “లవ్ స్టోరి” థియేటర్ రిలీజ్ కు రావడం అటు ఎగ్జిబిషన్ సెక్టార్ లోనూ ఉత్సాహం నింపబోతోంది.

Sept 10 release date set for Chaitanya's 'Love Story'

“లవ్ స్టోరి” సినిమాలో పాటలు అనూహ్య ఆదరణ పొందాయి. యూట్యూబ్ వ్యూస్ లో ‘సారంగదరియా’ ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసింది. ‘హే పిల్లా’, ‘నీ చిత్రం చూసి..’ పాటలు కూడా మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించాయి. “లవ్ స్టోరి” మ్యూజికల్ గా హిట్ అవడం సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించబోయే ప్లెజంట్, ఎమోషనల్ ప్రేమ కథకు ఈ పాటలు అదనపు ఆకర్షణ కానున్నాయి.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ”లవ్ స్టోరి” చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు.