లుంగీ లుక్ తో ఆకట్టుకుంటోన్న నాగ చైతన్య..!

0
580
Naga Chaitanya Birthday Poster Released From Love Story Movie

కథానుసారం, సహజత్వం కోసం నటీనటులు పలురకాల వేషధారణలతో కనిపిస్తుంటారు. ఒక్కోసారి ఎప్పుడూ చూడని లూక్స్ లో కూడా కొందరు నటీనటులను చూస్తుంటాం. నేడు (నవంబర్ 23) అక్కినేని నాగ చైతన్య 34వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో లుంగీ కట్టి అదిరిపోయే లుక్‌లో కనిపిస్తున్నారు చైతూ. సహజత్వానికి దగ్గరగా సినిమాలను తీసే శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో పాత్రలు కూడా నిజజీవితానికి దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు.

ఇక ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన చైతూ బర్త్ డే స్పెషల్ పోస్టర్ చూస్తే..  మిడిల్ క్లాస్ కుర్రాడిగా సాధారణ లుంగీ, బనియన్ మీద కనిపించగా, ఓ సాధారణ యువకుడి పాత్రలో నాగ చైతన్య సహజంగా నటిస్తున్నట్లు ఈ లుక్ ద్వారా తెలుస్తోంది. తమ అభిమాన నటుడు ఆలా కనిపిస్తుండటంతో ఇందులో మాస్ అంశాలు చైతూ పాత్రలో పుష్కలంగా ఉంటాయని భావిస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మార్క్ క్యారెక్టరైజేషన్ చైతూ లుక్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Akkineni Naga Chaitanya Birthday Poster Released From Love Story Movie

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘లవ్ స్టోరి’ సినిమాలో చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. కె నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Previous articleమారేడుమిల్లిల్లో అర్హ పుట్టినరోజు వేడుకలు..!
Next articleBirthday Poster: Chaitanya Impresive look From ‘Love Story’!