Homeసినిమా వార్తలు'కస్టడీ' టీజర్: నిజమే ఒక ధైర్యం.. నిజమే ఒక సైన్యం అంటున్న చైతన్య..!

‘కస్టడీ’ టీజర్: నిజమే ఒక ధైర్యం.. నిజమే ఒక సైన్యం అంటున్న చైతన్య..!

Naga Chaitanya Custody Teaser Review, Custody movie Teaser, Custody Movie Release date, Kriithi Shetty, Custody Telugu Movie, Naga Chaitanya new movie teaser,

Naga Chaitanya Custody Teaser: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’. తమిళ విలక్షణ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో చైతూ కోలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. ‘వేట మొదలైంది’ అంటూ తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు.

Naga Chaitanya Custody Teaser: గతేడాది ‘థాంక్యూ’ చిత్రంతో ఫ్యాన్స్ ని నిరాశ పరిచిన చైతన్య.. ఇప్పుడు కంప్లీట్ యాక్షన్ మూవీతో వస్తున్నట్లు “కస్టడీ” టీజర్ ని బట్టి అర్థమవుతోంది. కథేంటనేది పూర్తిగా రివీల్ చేయనప్పటికీ.. సిస్టమ్ మొత్తానికి ఎదురెళ్లే ఓ సాధారణ కానిస్టేబుల్ కథని చూపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు.

ఇందులో శివ అనే కానిస్టేబుల్ గా నాగచైతన్య నటించారు. అతని లుక్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్ మెప్పిస్తున్నాయి. ఓ సన్నివేశంలో వింటేజ్ నాగార్జునను గుర్తుకు తెచ్చారు చై. విలన్ గా అరవింద్ స్వామి కొత్తగా కనిపించగా.. ప్రియమణి, శరత్ కుమార్ ఇతర పాత్రల్లో నటించారు.

“గాయ పడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అది నన్ను ఇప్పుడు తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో, ఎప్పుడోస్తుంది, ఎలా వస్తుందో నాకు తెలియదు.. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్‌.. దట్‌ ట్రూత్‌ ఇన్‌ మై కస్టడీ” అంటూ వచ్చే చైతూ వాయిస్ ఓవర్ ఆకట్టుకుంటోంది.

దర్శకుడు వెంకట్ ప్రభు తనదైన మార్క్ యాక్షన్ తో బలమైన కథతో ‘కస్టడీ’ సినిమాను తెరకెక్కించాడనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతుంది. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. కతీర్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. మొత్తం మీద ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్, సినిమాపై అంచనాలు పెంచేసింది.

“కస్టడీ” చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. సమ్మర్ కానుకగా మే 12న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.

- Advertisement -

Naga Chaitanya Custody Teaser Review, Custody movie Teaser, Custody Movie Release date, Kriithi Shetty, Custody Telugu Movie, Naga Chaitanya new movie teaser,

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY