Naga Chaitanya Dootha Web Series: బంగార్రాజు చిత్రంలో చివరిసారిగా పెద్ద తెరపై కనిపించిన నాగ చైతన్య ఇప్పుడు తన తదుపరి సినిమాలు అలాగే సిరీస్ పై గురు పెట్టినట్టు తెలుస్తుంది. ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న నాగచైతన్య వెబ్ సిరీస్ ఎట్టకేలకు షూటింగ్ కు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ గాను దూత అనే పేరును ఖరారు చేశారు మేకర్స్.
విక్రమ్ కుమార్ (Vikram K kumar) దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ సూపర్ నేచురల్/హారర్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. విక్రమ్ కుమార్ ఈ వెబ్ సిరీస్ తోపాటు నాగచైతన్య తదుపరి సినిమా అయినా థాంక్యూ కూడా డైరెక్షన్ చేస్తున్నారు. నాగచైతన్య (Naga Chaitanya) అలాగే విక్రమ్ కుమార్ దూత (Dootha Web Series) వెబ్ సిరీస్ ని తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది.
చైతూ మొదటిసారి హారర్ జోనర్ లో చేస్తుండటంతో దీనిపై అంచనాలు పెరిగాయి. నాగచైతన్య ప్రస్తుతం థ్యాంక్యూ మరియు బాలీవుడ్ డెబ్యూ లాల్ సింగ్ చద్దా విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. దూత వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ సంస్థాపకులు నిర్మిస్తున్నారు.