రామ్ డైరెక్టర్ తో నాగ చైతన్య సినిమా..?

0
1473
Naga chaitanya next with Kishore Tirumala movie

Naga Chaitanya Movies: ఫామిలీతో కలిసి చూసే సినిమాలు చేసే డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఆయన చేసిన నేను శైలజ , చిత్రాలహరి సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆ సినిమాలో నటించిన హీరోలకి మంచి ఇమేజ్ ని తీసుకొని వచ్చాయి. ఈ డైరెక్టర్‌తో నాగ చైతన్య ఓ సినిమా చేయనున్నట్టు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతు ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నాడు.

ఈ చిత్రం పూర్తవగానే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు ఇది వరకే వార్తలు వచ్చాయి. దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రాకముందే, మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. కరోన వలన ఈ సినిమా షూటింగ్ కి చిన్న బ్రేక్ పడటంతో ఇంతలోపు కిషోర్ ఇంకొక కథ అక్కినేని నాగ చైతన్య కి వినిపించారట.

స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండటంతో చైతు కూడా వెంటనే ఒప్పుకున్నారట. ఈ సినిమా పూర్తి ఫామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య బ్యానర్‌లో కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. కిషోర్ తిరుమల ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ‘ఆడాళ్లూ మీకు మీ జోహార్లు’ తెరకెక్కిస్తున్నాడు. ఇది కంప్లీట్ కాగానే నాగ చైతన్యతో సినిమా మొదలు పెట్టనున్నట్టు సమాచారం.