Naga Chaitanya Open Up Samantha Divorce first time: అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులు ఒకప్పటి ప్రేమ జంట గురించి సినీప్రపంచంలో సంచలనంగా మారాయి. ప్రేమ, పెళ్లి గురించి ఎంతగా చర్చించారో, విడాకుల విషయం ఇంకా ఎక్కువగా వైరల్ అయింది. అయితే, విడాకుల తర్వాత చైతూ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లి శోభితా ధూళిపాళ్లను వివాహం చేసుకున్నా, ఇప్పటికీ సమంత గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. దీనిపై చైతూ ఎప్పటికీ ఓపెన్‌గా స్పందించలేదు. కానీ, తాజాగా తండేల్ ప్రమోషన్స్‌లో తొలిసారి తన మనసులోని మాటలు వెల్లడించాడు.
‘‘విడిపోవాలని కలిసే నిర్ణయించుకున్నాం’’
నాగ చైతన్య తన విడాకులపై మాట్లాడుతూ, ‘‘సమంతతో కలిసి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. అయినా నెగిటివ్ కామెంట్స్ ఆగలేదు. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా, ట్రోలింగ్ ఎక్కువైంది. మా వ్యక్తిగత జీవితాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌లా చూస్తున్నారు. మా నిర్ణయాన్ని గౌరవించమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు’’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు.
‘‘విడాకులు తీసుకున్నందుకు నేనేం క్రిమినల్ కాదు’’
‘‘విడాకులపై ఎన్నో ఊహాగానాలు, రూమర్లు వచ్చాయి. అప్పుడే మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది, అందుకే మౌనం వహించాను. కానీ ఇప్పుడు చెబుతున్నా – ఇది మా వ్యక్తిగత నిర్ణయం. దయచేసి ఇంకెవరూ దీనిపై వ్యాఖ్యలు చేయకండి. విడాకులు తీసుకున్నాను కాబట్టి నేను క్రిమినల్ కాను. మా కుటుంబంలో కూడా విడాకుల అనుభవం ఉంది. చాలాసార్లు ఆలోచించి, మనసుకు వేదన కలిగేలా తీసుకున్న నిర్ణయం ఇది. ఒకరోజులో తీసుకున్నది కాదు’’ అని చైతూ పేర్కొన్నాడు.
శోభితాపై ప్రేమ – ‘‘ఆమె నా జీవితంలో నిజమైన హీరో’’
విడాకుల నాలుగేళ్ల తర్వాత నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ‘‘శోభితా నా జీవితంలోకి చాలా సహజంగా వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాం. అప్పటి నుంచి మా బంధం బలపడింది. ఆమె నా వ్యక్తిగత జీవితాన్ని చాలా బాగా అర్థం చేసుకుంది. ఇప్పుడు నా జీవితంలో నిజమైన హీరో శోభితానే’’ అని చైతూ ప్రేమను బహిరంగంగా వ్యక్తపరిచాడు.
చైతూ వ్యాఖ్యలు వైరల్
ఈ సందర్భంలో ‘‘శోభితా గురించి తప్పుగా మాట్లాడకండి’’ అని కూడా కోరాడు చైతన్య. ప్రస్తుతం నాగ చైతన్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై అభిమానులు, సినీ వర్గాల్లో హాట్ డిస్కషన్ జరుగుతోంది.