Custody Movie story: నాగచైతన్య (Naga Chaitanya) అలాగే కృతి శెట్టి (Krithi Shetty) ప్రేక్షకుల్ని అలరించడానికి కస్టడీ అనే మూవీతో ముందుకు వస్తున్నారు. వెంకట ప్రభు దర్శకత్వం వహించిన కస్టడీ మూవీ ని మే 12న గ్రాండ్గా విడుదల చేయడానికి సిద్ధం చేశారు మేకర్స్. నాగచైతన్య ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో బిజీగా. కస్టడీ మూవీ ట్రైలర్ (Custody trailer) ఈ నెల 5న విడుదల చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు కస్టడీ స్టోరీ పై నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..
Custody Movie story: కస్టడీ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగచైతన్య (Naga Chaitanya) అలాగే కృతి శెట్టి మరియు దర్శకుడు వెంకట ప్రభు నిన్న హైదరాబాదులో జరిగిన మీడియా సమావేశంలో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే నాగచైతన్య ఈ కస్టడీ (Custody) సినిమాకు సంబంధించిన మెయిన్ స్టోరీ లైన్ ని చెప్పేశారు.
నాగచైతన్య మాట్లాడుతూ ” సాధారణంగా ఏ సినిమాలో అయినా హీరో విలన్ వెంటపడుతూ చివరికి విలన్ మీద హీరో కక్ష సాధిస్తాడు.. అయితే కస్టడీ మూవీ రొటీన్ సినిమాలకి భిన్నంగా ఉంటుంది.. ఈ సినిమాలో విలన్ ని కాపాడటమే హీరో మిషన్.. అలాగే విలన్ కి వచ్చే ఆపదలను అడ్డుకుంటూ రక్షించడమే హీరో పని అని చెప్పడం జరిగింది”.
స్టోరీ (Custody story) లైన్ వింటుంటేనే కొత్తగా అనిపిస్తుంది కదా.. మరి దర్శకుడు వెంకట ప్రభు కస్టడీ స్టోరీని ఎలా తెరకెక్కించాడు అనేది మరికొన్ని రోజులు పోతే గాని తెలియదు. ఈనెల 5న కస్టడీ ట్రైలర్ (Custody trailer) ని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ కూడా ప్రకటించారు. ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమా కథపై మరింత క్లారిటీ వస్తుంది. ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న అక్కినేని ఫ్యామిలీ ఈ కస్టడీ మూవీతో విజయం సాధిస్తారో లేదో వేచి చూడాల్సిందే.